News December 17, 2024
JPC అంటే ఏంటి?
JPC(జాయింట్ పార్లమెంటరీ కమిటీ) పార్లమెంటు ఉభయసభల ప్రతినిధులతో కూడినది. ఇది బిల్లు పరిశీలనతో పాటు సిఫార్సులు చేస్తుంది. వాటిని ప్రభుత్వం పాటించాల్సిన అవసరం లేదు. కమిటీ పదవీకాలం లేదా విధి పూర్తైన తర్వాత రద్దవుతుంది. JPC సభ్యుల సంఖ్య ఒక్కోసారి ఒక్కోలా ఉంటుంది. నేడు జమిలి బిల్లు లోక్‌సభ ఆమోదం పొందగా, JPCకి పంపేందుకు సిద్ధమని అమిత్ షా ప్రకటించారు. JPC సభ్యుల పేర్లపై సాయంత్రానికి క్లారిటీ రానుంది.
Similar News
News January 25, 2025
జగన్ CM కావడానికి VSR పనిచేశారు: కాకాణి
AP: జగన్ CM కావడానికి <<15247358>>విజయసాయిరెడ్డి<<>> పని చేశారని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి అన్నారు. ‘పార్టీ కోసం పాటుపడ్డారు. కుట్రలు, దుష్ప్రచారం చేసినా ధైర్యంగా ఎదుర్కొన్నారు. వైసీపీతో ఆయనకు విడదీయరాని అనుబంధం ఉంది’ అని కాకాణి చెప్పారు. మరోవైపు తాను వైసీపీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలను ఆ పార్టీ నేత అయోధ్య రామిరెడ్డి ఖండించారు. దావోస్ పర్యటన నుంచి వచ్చాక మీడియాతో మాట్లాడతానన్నారు.
News January 25, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 25, శనివారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.49 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.32 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.08 గంటలకు ✒ ఇష: రాత్రి 7.23 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 25, 2025
శుభ ముహూర్తం (25-01-2025)
✒ తిథి: బహుళ ఏకాదశి రా.6.24 వరకు ✒ నక్షత్రం: జ్యేష్ట పూర్తిగా ✒ శుభ సమయములు: సా.4.32 నుంచి 5.20 వరకు ✒ రాహుకాలం: ఉ.9.00-10.30 వరకు ✒ యమగండం: ఉ.1.30-3.00 వరకు ✒ దుర్ముహూర్తం: 1) ఉ.6.00-7.36 వరకు ✒ వర్జ్యం: ఉ.11.31-1.13 వరకు ✒ అమృత ఘడియలు: సా.9.04-10.48 వరకు