News December 18, 2024
Work Smart.. నాట్ హార్డ్: Dell CEO
ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎప్పుడూ స్మార్ట్‌గా పనిచేయాలి తప్ప హార్డ్‌గా కాదని ఉద్యోగులకు Dell CEO Michael Dell సూచించారు. రోజులో అధిక పనిగంటలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయన్నారు. పని ప్రదేశాల్లో సరదాగా ఉండకపోతే పనిచేసే విధానం సరిగాలేదనే అర్థమన్నారు. పనిలో ప్రయోగాలు చేయాలని, రిస్క్ తీసుకోవాలని, విఫలమవ్వాలని, క్లిష్ట సమస్యలను పరిష్కరిస్తూ ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
Similar News
News February 5, 2025
WORLD RECORD: ఒంగోలు జాతి ఆవు ధర రూ.41 కోట్లు
సాధారణంగా ఆవు ధర వేలల్లో, కాస్త పాలు ఎక్కువగా ఇచ్చే రకమైతే రూ.1-2 లక్షలు ఉంటుంది. అయితే ఒంగోలు/నెల్లూరు బ్రీడ్‌కు చెందిన వయాటినా-19 అనే ఆవు జ్రెజిల్‌లో నిర్వహించిన వేలంలో ఏకంగా రూ.41 కోట్లకు అమ్ముడైంది. దీంతో గతంలో ఉన్న రికార్డులన్నీ బ్రేకయ్యాయి. కాగా 1800sలో ఒంగోలు ఆవును బ్రెజిల్‌కు తీసుకెళ్లారు. అక్కడ అనేక జెనెటిక్ మార్పులతో ప్రాచుర్యం పొందింది. వయాటినా-19 బరువు ఏకంగా 1,101kgలు.
News February 5, 2025
చికెన్ తినడానికి భయపడుతున్నారా?
APలోని కొన్నిచోట్ల కోళ్లు చనిపోతున్న <<15366175>>ఘటనలపై <<>>పశుసంవర్ధక శాఖ అధికారులు స్పందించారు. ఈ ఘటనలతో కోళ్లు, గుడ్లు తినేందుకు ప్రజలు సంకోచిస్తుండటంతో వీటి వినియోగం వల్ల అనారోగ్యం సంభవించినట్లు ఎక్కడా నిర్ధారణ కాలేదన్నారు. ప్రజలు అపోహలకు గురికావొద్దని, ఉడికించిన గుడ్లు, చికెన్ తీసుకోవచ్చని సూచించారు. కొల్లేరు సరస్సుకు ఈ ఏడాది వలస పక్షులు అధికంగా రావడం కూడా ఆ సమీపంలో కోళ్ల మృతికి కారణంగా భావిస్తున్నారు.
News February 5, 2025
ఆస్ట్రేలియా జట్టుకు బిగ్ షాక్!
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆస్ట్రేలియా జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ఆ జట్టు కెప్టెన్ కమిన్స్ గాయం కారణంగా అందుబాటులో ఉండరని క్రీడా వర్గాలు తెలిపాయి. మరో వైపు హజిల్‌వుడ్ తన ఫిట్‌నెస్ నిరూపించుకోవాల్సి ఉంది. కమిన్స్ స్థానంలో స్మిత్ లేదా హెడ్ సారథ్య బాధ్యతలు స్వీకరించే అవకాశమున్నట్లు సమాచారం. జట్టు మేనేజ్మెంట్ నుంచి ఈ విషయమై ప్రకటన రావాల్సి ఉంది.