News December 18, 2024
Work Smart.. నాట్ హార్డ్: Dell CEO
ప్రొఫెషనల్ లైఫ్‌లో ఎప్పుడూ స్మార్ట్‌గా పనిచేయాలి తప్ప హార్డ్‌గా కాదని ఉద్యోగులకు Dell CEO Michael Dell సూచించారు. రోజులో అధిక పనిగంటలు ప్రతికూల ఫలితాలు ఇస్తాయన్నారు. పని ప్రదేశాల్లో సరదాగా ఉండకపోతే పనిచేసే విధానం సరిగాలేదనే అర్థమన్నారు. పనిలో ప్రయోగాలు చేయాలని, రిస్క్ తీసుకోవాలని, విఫలమవ్వాలని, క్లిష్ట సమస్యలను పరిష్కరిస్తూ ధైర్యంగా ముందుకు సాగాలని సూచించారు.
Similar News
News January 25, 2025
వ్యాయామం చేస్తున్నారా.. ఇవి తెలుసుకోండి!
వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదే అయినా జాగ్రత్తలు తీసుకోకుంటే గుండెపై భారం పడి కుప్పకూలిపోయే ప్రమాదముంది. శక్తికి మించి వ్యాయామం చేయకూడదు. ఒంట్లో నీటి % తగ్గకుండా చూసుకోవాలి. వ్యాయామాలు చేసేందుకు ఫిట్‌గా ఉన్నామా? లేదా? తెలుసుకోవాలి. ఇంట్లో ఎవరికైనా గుండెపోటు వచ్చి ఉంటే వైద్యులను సంప్రదించిన తర్వాతే చేయడం బెటర్. శరీరాకృతి కోసం స్టెరాయిడ్స్ వాడకూడదు. కడుపునిండా భోజనం చేసి ఎక్సర్‌సైజ్ చేయకూడదు.
News January 25, 2025
డాలర్‌తో రూపాయి క్షీణతపై మోదీకి కాంగ్రెస్ సెటైర్
డాలర్‌తో రూపాయి మారకం విలువ పడిపోతుండటంతో కాంగ్రెస్ పార్టీ ప్రధాని మోదీని విమర్శించింది. నెహ్రూ ప్రధానిగా ఉన్న కాలం నుంచి ప్రస్తుత మోదీ పాలన వరకు రూపాయి క్షీణించడంలో ఎవరి పాత్ర ఎంతమేర ఉందో తెలుపుతూ ఓ ఫొటోను ట్వీట్ చేసింది. ఇందులో మోదీదే అత్యధిక వాటా అంటూ పేర్కొంది. పై ఫొటోలో దానికి సంబంధించిన వివరాలు చూడొచ్చు. రూపాయి విలువ భారీ పతనం మోదీ పాలనలో జరిగిందని అందులో కాంగ్రెస్ పేర్కొంది.
News January 25, 2025
జియో భారత్ ఫోన్లలో కొత్త ఫీచర్
జియో భారత్ ఫోన్లలో ‘జియో సౌండ్ పే’ అనే కొత్త ఫీచర్ తీసుకొచ్చినట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది దేశంలోని 5కోట్ల మంది చిరువ్యాపారులకు ఉపయోగపడుతుందని జియో ఇన్ఫొకామ్ లిమిటెడ్ ప్రెసిడెంట్ సునీత్ దత్ చెప్పారు. వినియోగదారుల ఆన్‌లైన్ పేమెంట్ కన్ఫర్మేషన్ కోసం సౌండ్ బాక్సులు అవసరం లేదని, ఫ్రీగా ‘జియో సౌండ్ పే’తో ఫోన్‌లోనే మెసేజ్ వినొచ్చని తెలిపారు. దీంతో ప్రతి వ్యాపారికి ఏడాదికి రూ.1500 సేవ్ అవుతుందన్నారు.