News December 18, 2024
రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి

నవీ ముంబైలోని డా.డీవై పాటిల్ స్టేడియంలో భారత్‌తో జరిగిన రెండో T20లో వెస్టిండీస్ మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట IND 20 ఓవర్లలో 159/9 స్కోర్ చేసింది. స్మృతి మందాన (62) టాప్ స్కోరర్‌గా నిలిచారు. అనంతరం WI 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్ మాథ్యూస్ (47 బంతుల్లో 85) రాణించారు. 3 మ్యాచుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో T20 రేపు జరగనుంది.
Similar News
News January 13, 2026
భారీ జీతంతో 260 పోస్టులకు నోటిఫికేషన్

షార్ట్ సర్వీస్ కమిషన్ ద్వారా 260 ఆఫీసర్ పోస్టుల భర్తీకి నేవీ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హతగల వారు JAN 24 -FEB 24 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి BE/BTech, MBA, BSc/B.Com/BSc(IT), MSc/MA, ME/MTech ఉత్తీర్ణతతో పాటు శారీరక ప్రమాణాలు కలిగి ఉండాలి. మెరిట్, SSB ఇంటర్వ్యూ, DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు రూ.1.25L చెల్లిస్తారు. * మరిన్ని ఉద్యోగాలకు<<-se_10012>> జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News January 13, 2026
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేదలో ఉద్యోగాలు

ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (<
News January 13, 2026
రాష్ట్ర రాజకీయాలను కుదిపేసిన స్కిల్ కేసు!

AP: స్కిల్ <<18842559>>కేసులో<<>> CBN అరెస్ట్ రాష్ట్ర రాజకీయాలను కుదిపేసింది. 2024లో TDP నేతృత్వంలోని కూటమి అధికారంలోకి రావడానికి ఈ కేసు కారణమైంది. CBN జైల్లో ఉన్న సమయంలో రాష్ట్రంలో అనూహ్య పరిణామాలు జరిగాయి. లోకేశ్, భువనేశ్వరి, బ్రహ్మణి రోడ్లపై నిరసనలకు దిగారు. పవన్ కళ్యాణ్ జైల్లో ఆయనను పరామర్శించి TDPతో పొత్తును ప్రకటించారు. BJP కూడా కలిసిరావడంతో 2024లో కూటమి ఘనవిజయం సాధించింది. వైసీపీ ఘోర పరాభవం ఎదుర్కొంది.


