News December 18, 2024

రెండో టీ20లో టీమ్ ఇండియా ఓటమి

image

నవీ ముంబైలోని డా.డీవై పాటిల్ స్టేడియంలో భారత్‌తో జరిగిన రెండో T20లో వెస్టిండీస్ మహిళల జట్టు 9 వికెట్ల తేడాతో గెలిచింది. మొదట IND 20 ఓవర్లలో 159/9 స్కోర్ చేసింది. స్మృతి మందాన (62) టాప్ స్కోరర్‌గా నిలిచారు. అనంతరం WI 15.4 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. ఆ జట్టు కెప్టెన్ మాథ్యూస్ (47 బంతుల్లో 85) రాణించారు. 3 మ్యాచుల సిరీస్‌లో ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. మూడో T20 రేపు జరగనుంది.

Similar News

News January 14, 2025

భార్యలతో స్టేయింగ్ టైమ్ కుదించిన BCCI?

image

టీమ్ఇండియా వరుస వైఫల్యాల నుంచి BCCI మేలుకుంటోంది. క్రికెటర్లపై కఠిన ఆంక్షల అమలుకు సిద్ధమవుతోందని సమాచారం. జట్టులో VVIP కల్చర్‌ను తగ్గించేందుకు ఇకపై అందరూ టీమ్‌బస్సులోనే ప్రయాణించాలని ఆదేశించింది. భార్యాపిల్లలతో స్టేయింగ్‌ను చిన్న టోర్నీలప్పుడు 7, పెద్ద టోర్నీలప్పుడు 14 రోజులకు కుదించినట్టు తెలిసింది. ఆటగాళ్ల బ్యాగేజ్ 150KG కన్నా ఎక్కువ ఉండకూడదు. గౌతీ మేనేజర్ VIP BOXలో ఉండకూడదు. మీ కామెంట్.

News January 14, 2025

వెంకటేశ్ ‘సంక్రాంతికి వస్తున్నాం’ రివ్యూ

image

కిడ్నాపైన హై ప్రొఫైల్ వ్యాపారిని రక్షించేందుకు సస్పెండైన పోలీస్ ఏం చేశాడనేదే ‘సంక్రాంతికి వస్తున్నాం’ స్టోరీ. హీరో వెంకటేశ్, ఐశ్వర్య రాజేశ్, మీనాక్షిల మధ్య సాగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తాయి. వెంకీ కుమారుడు బుల్లిరాజు పాత్ర, సాంగ్స్, కామెడీ సినిమాకు హైలైట్. డైరెక్టర్ అనిల్ రావిపూడి స్టోరీ కంటే కామెడీపైనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఫస్టాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్ స్లోగా సాగుతుంది.
RATING: 2.75/5

News January 14, 2025

రోడ్డు ప్రమాదం.. మంత్రికి తప్పిన ముప్పు

image

కర్ణాటక మంత్రి హెబ్బాల్కర్ లక్ష్మి త్రుటిలో ప్రాణాలతో బయటపడ్డారు. బెళగావి జిల్లాలో ఆమె ప్రయాణిస్తున్న ఇన్నోవా కారు చెట్టును బలంగా ఢీకొట్టింది. కుక్క రోడ్డును దాటుతుండగా దాన్ని తప్పించేందుకు టర్న్ చేయడంతో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో కారు ముందరి భాగం పూర్తిగా ధ్వంసమైంది. ఎయిర్ బ్యాగులు తెరుచుకోవడంతో ప్రాణాపాయం తప్పింది. మంత్రి ముఖం, నడుముకు స్వల్ప గాయాలయ్యాయి.