News December 18, 2024

100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు

image

హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, ఇతర పనుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయనుంది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున లేదా వచ్చే నెల తొలి వారంలో ఆర్‌అండ్‌బీ టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.

Similar News

News March 13, 2026

మూసీ పరీవాహకం నివాసయోగ్యం కాదు: రేవంత్

image

TG: HYDలోని మూసీ పరీవాహక ప్రాంత ప్రజల పట్ల తాను కూడా సానుభూతితో ఉన్నానని CM రేవంత్ తెలిపారు. కానీ కింద ఉన్న నల్గొండ జిల్లా వాసుల పరిస్థితి అర్థం చేసుకోండని సూచించారు. ఎవరికో నష్టం కలిగించాలనే ఉద్దేశం తనకు లేదన్నారు. ‘మూసీ పరీవాహకం నివాసయోగ్యమైనది కాదని WHO స్వయంగా నివేదిక ఇచ్చింది. అక్కడ నివసించే మహిళలకు ప్రెగ్నెన్సీ సమస్యలు వస్తున్నాయి. ఆ ప్రాంతాల్లో పండించే పంటలు విషపూరితమైపోయాయి’ అని తెలిపారు.

News March 13, 2026

మూసీ పునరుద్ధరణను గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్టా: రేవంత్

image

TG: చరిత్రలో నగరాలన్నీ నదీ పరీవాహక ప్రాంతాల్లోనే అభివ‌ృద్ధి చెందాయని CM రేవంత్ రెడ్డి అన్నారు. మనం కూడా అభివృద్ధిని అందుకోవాలనే మూసీ పునరుజ్జీవానికి శ్రీకారం చుట్టామన్నారు. అలాంటి ప్రాజెక్టును గుడ్డిగా వ్యతిరేకించడం కరెక్టా అని ప్రతిపక్షాలనుద్దేశించి ప్రశ్నించారు. BRS, BJP దీన్ని ఎందుకు వ్యతిరేకిస్తున్నాయని నిలదీశారు. మూసీ పునరుద్ధరణ ప్రాజెక్ట్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో CM ఈ వ్యాఖ్యలు చేశారు.

News March 13, 2026

వివాదంలో మరో IPL జట్టు

image

హండ్రెడ్ లీగ్‌లో PAK బౌలర్ అబ్రార్‌ను తీసుకొని <<19368622>>సన్‌రైజర్స్<<>> విమర్శలు ఎదుర్కొంటుండగా తాజాగా మరో IPL జట్టు వివాదంలో చిక్కుకుంది. CSKపై సన్ టీవీ రూ.కోటికి దావా వేసింది. జైలర్, జైలర్-2, కూలీ సినిమాల్లోని బ్యాగ్రౌండ్ మ్యూజిక్, ఆడియో ట్రాక్‌, డైలాగులు వాడుకొని కాపీరైట్ ఉల్లంఘించిందని మద్రాస్ HCకు చెప్పింది. కాగా వాటిని తొలగించామని CSK చెప్పగా మరోసారి ఇరువర్గాల వాదన విని నిర్ణయం తీసుకుంటామని HC తెలిపింది.