News December 18, 2024
100 ఎకరాల్లో తెలంగాణ కొత్త హైకోర్టు
హైదరాబాద్ శివారులోని రాజేంద్ర నగర్‌లో 100 ఎకరాల్లో కొత్త హైకోర్టు నిర్మాణానికి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఇందుకోసం రూ.2583 కోట్లు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మొత్తంలో సివిల్ పనుల కోసం రూ.1980 కోట్లు, ఇతర పనుల కోసం రూ.603 కోట్లు ఖర్చు చేయనుంది. హైకోర్టు భవన నిర్మాణానికి ఈ నెలాఖరున లేదా వచ్చే నెల తొలి వారంలో ఆర్‌అండ్‌బీ టెండర్లు పిలవనున్నట్లు సమాచారం.
Similar News
News January 16, 2025
ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఎల్టీసీ(లీవ్ ట్రావెల్ కన్సెషన్) స్కీమ్ కింద ప్రీమియం రైళ్లలోనూ ప్రయాణించే వెసులుబాటును కేంద్రం కల్పించింది. తేజస్, వందే భారత్, హంసఫర్ వంటి ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ప్రయాణించేందుకు అనుమతిచ్చింది. దీని ప్రకారం ప్రభుత్వ సంస్థల ఉద్యోగులు ప్రయాణ సమయంలో వేతనంతో కూడిన సెలవుతో పాటు టికెట్ ఖర్చులకు రీయింబర్స్‌మెంట్ పొందవచ్చు.
News January 16, 2025
‘ముక్కనుమ’ గురించి తెలుసా?
సంక్రాంతి వేడుకలు చాలా చోట్ల మూడు రోజులే చేసుకున్నా కొన్ని ప్రాంతాల్లో మాత్రం నాలుగో రోజు కూడా నిర్వహిస్తారు. దీనినే ముక్కనుమ అని కూడా పిలుస్తారు. ఈ రోజున ఊర్లోని గ్రామదేవతలను భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. కనుమ రోజున మాంసం తినని వారు ఈ రోజున భుజిస్తారు. ఈ పండుగను ఎక్కువగా తమిళనాడులో నిర్వహించుకుంటారు. తమిళులు దీనిని కరినాళ్ అని పిలుస్తారు.
*ముక్కనుమ శుభాకాంక్షలు
News January 16, 2025
పౌరులకు మానవతా సాయం అందించండి: యూఎన్ చీఫ్
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు UN చీఫ్ అంటోనీ గుటెర్రస్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం చేసిన ఈజిఫ్టు, ఖతార్, యూఎస్ఏను ఆయన అభినందించారు. బాధిత పౌరులకు అవసరమైన మానవతా సహాయాన్ని అందించాలని పిలుపునిచ్చారు. ఎదురయ్యే సవాళ్లను తెలుసుకొని సాధ్యమయ్యే ప్రతిదీ చేస్తామని పేర్కొన్నారు. ఈ నిర్ణయాన్ని యూకే ప్రధాని స్టార్మర్ స్వాగతించారు.