News December 18, 2024

INS నిర్దేశక్‌ జాతికి అంకితం

image

సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ జాతికి అంకితం చేశారు. ఇవాళ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో ఇది జలప్రవేశం చేసింది. దీనిని హైడ్రోగ్రఫీ సర్వేలు, నేవిగేషన్ అవసరాల కోసం రూపొందించారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ పరికరాలతో దీనిని నిర్మించారు. ఇది 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 110 మీటర్ల పొడవు ఉండే ఈ నౌక రెండు డీజిల్ ఇంజిన్ల సహకారంతో నడుస్తుంది.

Similar News

News July 5, 2025

WOW.. అంతరిక్షం నుంచి మెరుపు ఎలా ఉందో చూడండి

image

అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తీసిన మెరుపు ఫొటో నెటిజన్లను మైమరిపిస్తోంది. దీనిని స్ప్రైట్ అని పిలుస్తారని నిపుణులు చెబుతున్నారు. ఇది సాధారణ మెరుపులా కాకుండా జెల్లీ ఫిష్ ఆకారపు పేలుళ్లు లేదా స్తంభంలా కనిపిస్తుందని పేర్కొన్నారు. ‘జస్ట్ వావ్. మేము ఈ ఉదయం మెక్సికో & యూఎస్ మీదుగా వెళ్లినప్పుడు, నేను ఈ స్ప్రైట్‌ను బంధించా’ అని వ్యోమగామి నికోల్ SMలో ఈ చిత్రాన్ని పంచుకోగా వైరలవుతోంది.

News July 5, 2025

ఇన్‌స్టాలో అమ్మాయి, అబ్బాయి ముద్దు వీడియో వైరల్.. తర్వాత..

image

TG: సోషల్ మీడియాను మిస్ యూస్ చేస్తే అనర్థాలకు దారి తీస్తుందనడానికి ఈ ఘటనో ఉదాహరణ. వరంగల్‌లోని కొత్తవాడకు చెందిన మైనర్ బాలిక, బాలుడు ముద్దు పెట్టుకుంటూ వీడియో తీసుకొని దాన్ని ఇన్‌స్టాలో అప్‌లోడ్ చేశారు. అది కాస్తా క్షణాల్లో వైరలై ఇరు కుటుంబాల వాళ్లు చూశారు. దీంతో 2 వర్గాలు రోడ్డుపైకి వచ్చి పరస్పరం దాడి చేసుకున్నాయి. ఆ ప్రాంతం రణరంగాన్ని తలపించడంతో పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు.

News July 5, 2025

రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబీస్ టీకాలు

image

AP: ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా రేపు కుక్కలకు ఉచితంగా యాంటీరేబిస్ టీకాలు వేయనున్నట్లు పశుసంవర్ధక శాఖ తెలిపింది. పశువైద్యశాలలు, ఏరియా వెటర్నరీ ఆస్పత్రులు, పాలీ క్లినిక్స్, సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల్లో ఇవి అందించనున్నారు. ఇందుకోసం 5.37 లక్షల టీకాలను సిద్ధం చేశారు. జంతువుల నుంచి మనుషులకు లేదా మనుషుల నుంచి జంతువులకు సంక్రమించే వ్యాధులను జూనోటిక్ వ్యాధులు అంటారు.