News December 18, 2024
INS నిర్దేశక్ జాతికి అంకితం
సర్వే నౌక ఐఎన్ఎస్ నిర్దేశక్‌ను కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ జాతికి అంకితం చేశారు. ఇవాళ విశాఖపట్నం నేవల్ డాక్ యార్డులో ఇది జలప్రవేశం చేసింది. దీనిని హైడ్రోగ్రఫీ సర్వేలు, నేవిగేషన్ అవసరాల కోసం రూపొందించారు. అత్యాధునిక హైడ్రో, ఓషనోగ్రాఫిక్ పరికరాలతో దీనిని నిర్మించారు. ఇది 18 నాటికల్ మైళ్ల వేగంతో ప్రయాణించగలదు. 110 మీటర్ల పొడవు ఉండే ఈ నౌక రెండు డీజిల్ ఇంజిన్ల సహకారంతో నడుస్తుంది.
Similar News
News January 13, 2025
PIC OF THE DAY: భక్తితో పాటు దేశభక్తి
144 ఏళ్లకు ఓసారి వచ్చే మహా కుంభమేళా ప్రయాగ్‌రాజ్ (యూపీ)లో ఘనంగా ప్రారంభమైంది. లక్షలాది మంది హిందూ సాధువులు, ప్రజలు గంగా, యమునా, సరస్వతి నదులు కలిసే త్రివేణి సంగమం వద్ద పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారు. ఇందులో ఓ వ్యక్తి త్రివర్ణ పతాకం చేతబూని రెపరెపలాడించాడు. భక్తి, దేశభక్తి అద్భుతమంటూ నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. ఈ మహా కుంభమేళా దేశానికి గర్వకారణం, గుర్తింపు అని యూపీ అధికారులు ట్వీట్ చేశారు.
News January 13, 2025
కౌశిక్ రెడ్డిపై స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో తనను దుర్భాషలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని ఆయనకు స్పీకర్ బదులిచ్చారు.
News January 13, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: సౌతాఫ్రికా టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం సౌతాఫ్రికా టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
టీమ్: టెంబా బవుమా (C), ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వన్ డర్ డస్సెన్, రికెల్టన్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్, ముల్డర్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, షంసీ, ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, నోర్ట్జే.