News December 18, 2024

SKLM: రూ.15 లక్షలు వేరే అకౌంట్లోకి.. తిరిగి అందించిన పోస్టల్ సిబ్బంది

image

అరసవిల్లికి చెందిన ప్రసాదరావు అనే వ్యక్తి తన బ్యాంకు అకౌంట్లో దాచుకున్న సుమారు రూ.15 లక్షలను పోస్ట్ ఆఫీస్ అకౌంట్‌కు ట్రాన్స్‌ఫర్ చేయించారు. అయితే ఆ నగదు సాంకేతిక లోపంవల్ల ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఓ వ్యక్తి ఖాతాలోకి జమ అయ్యాయి. కాగా పోస్టల్ సిబ్బంది అంబుడ్సమన్ ద్వారా ఆ నగదును తిరిగి కస్టమర్‌ అకౌంట్లోకి క్రెడిట్ అయ్యేలా చేశారు. దీంతో పోస్ట్ మాస్టర్‌ రంగారావుకి కస్టమర్ సన్మానం చేసి కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 5, 2025

శ్రీకాకుళం జిల్లా బెంతు ఒరియా అధ్యక్షుడిగా రజనీ కుమార్

image

బెంతు ఒరియాల శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడిగా బల్లిపుట్టుగకు చెందిన రజనీ కుమార్ దొళాయిని నియమితులయ్యారు. బుధవారం జరిగిన ఎన్నికల్లో సంఘం సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా ఉన్న శ్యాంపురియా ఇటీవల మృతి చెందడంతో నూతన కార్యవర్గాన్ని ఏర్పాటు చేశారు. జిల్లా బెంతు ఒరియా కుల సంఘం అధ్యక్షుడిగా రజిని కుమార్ దోళాయి, ఉపాధ్యక్షుడిగా ఢిల్లీ మజ్జి, తదితరులను ఎన్నుకున్నారు.

News February 5, 2025

1.20లక్షల మందికి సూర్యనారాయణ స్వామి దర్శనం

image

అరసవల్లిలో రథసప్తమి ఉత్సవాలు పూర్తిస్థాయిలో సక్సెస్ అయ్యాయని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. జిల్లా అధికారుల ప్రోద్భలంతో ఉత్సవాలు ఘనంగా జరిగాయని కొనియాడారు. ఈఏడాది సూర్యనారాయణ స్వామిని 1.20 లక్షల మంది భక్తులు దర్శనం చేసుకున్నారని ఎమ్మెల్యే వెల్లడించారు. అయినప్పటికీ ఎక్కడా ఎలాంటి ఇబ్బంది రాలేదని చెప్పారు.

News February 5, 2025

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి

image

తెలంగాణలోని యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇచ్చాపురం మండలం అందెపల్లి గ్రామానికి చెందిన ఉదయ్(25) మృతి చెందాడు. యువకుడు లింగోజిగూడెంలోని ఓ ఫార్మా కంపెనీలో పని చేస్తున్నాడు. మంగళవారం తన ఇద్దరు స్నేహితులతో కలిసి యాదగిరిగుట్టకు బైక్‌పై వెళ్లి తిరిగొస్తుండగా అదుపుతప్పి కిందపడ్డారు. ఈ ఘటనలో ఉదయ్ మృతి చెందగా.. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి.

error: Content is protected !!