News December 19, 2024

సిద్దిపేట: పెళ్లైన 22 రోజులకే ఫోక్ సింగర్ ఆత్మహత్య

image

సిద్దిపేట జిల్లాలో ఫోక్ <<14917574>>సింగర్ శ్రుతి<<>>(26) నిన్న అనుమానాస్పద రీతిలో సూసైడ్ చేసుకుంది. NZB జిల్లాకు చెందిన శ్రుతి, పీర్లపల్లికి చెందిన దయాకర్‌ 22 రోజుల క్రితం ప్రేమపెళ్లి చేసుకున్నారు. నిన్న అత్తగారి ఇంట్లో సూసైడ్ చేసుకోగా ఆమె 4నెలల గర్భిణి. అయితే కుటుంబ కలహాలతోనే ఆత్మహత్య చేసుకుందని దయాకర్‌ కుటుంబీకులు చెప్పగా తమ కుమార్తెను హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరిస్తున్నారని శ్రుతి తల్లిదండ్రులు ఆరోపించారు.

Similar News

News January 12, 2026

మెదక్: ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలి: అదనపు కలెక్టర్

image

కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమాన్ని ప్రజలు సమస్యల పరిష్కారానికి సమర్థంగా ఉపయోగించుకోవాలని అదనపు కలెక్టర్ నగేశ్ తెలిపారు. సమావేశ మందిరంలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజల నుంచి మొత్తం 44 అర్జీలను స్వీకరించారు. ఇందులో భూభారతి-32, పెన్షన్-2, ఇందిరమ్మ ఇళ్లు-2, ఇతర సమస్యలపై- 9 దరఖాస్తులు వచ్చినట్లు చెప్పారు. వచ్చిన అర్జీలను వెంటనే పరిశీలించి పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

News January 12, 2026

వివేకానంద స్ఫూర్తితో యువత ముందుకు సాగాలి: కలెక్టర్

image

స్వామి వివేకానంద స్ఫూర్తితో యువత ఉన్నత లక్ష్యాల వైపు అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ పిలుపునిచ్చారు. సోమవారం పెద్ద శంకరంపేట రైతు వేదికలో నిర్వహించిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. అనంతరం వివేకానంద జయంతి వేడుకల్లో భాగంగా చిత్రపటానికి నివాళులర్పించారు. యువత కేవలం చదువుకే పరిమితం కాకుండా క్రీడలు, సాంస్కృతిక రంగాల్లోనూ రాణించి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని కలెక్టర్ సూచించారు.

News January 12, 2026

జాతీయస్థాయికి 11 మంది మెదక్ క్రీడాకారులు

image

జాతీయస్థాయి రగ్బీ పోటీలకు మెదక్ జిల్లా నుంచి 11 మంది క్రీడాకారులు ఎంపికైనట్లు కోచ్ కర్ణం గణేశ్ రవికుమార్ తెలిపారు. రంగారెడ్డి జిల్లా బోయిన్పల్లిలో జరిగిన రాష్ట్రస్థాయి అండర్-15, పోటీలలో 13 జిల్లాలకు చెందిన బాల, బాలికలు పాల్గొన్నారు. మెదక్ జిల్లా బాలికల టీం రెండో స్థానం కైవసం చేస్తుందని తెలిపారు. ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జరిగే జాతీయస్థాయి పోటీల్లో వీరు పాల్గొంటారని పేర్కొన్నారు.