News December 19, 2024

YS జగన్‌ను కలిసిన జోగి రమేశ్

image

AP: YCP అధినేత, మాజీ CM జగన్‌ను మాజీ మంత్రి జోగి రమేశ్ కలిశారు. నూజివీడులో TDP నేతలతో కలిసి ఆయన గౌతు లచ్చన్న విగ్రహావిష్కరణలో పాల్గొనడం జిల్లా రాజకీయాలను కుదుపునకు గురిచేశాయి. ఈ నేపథ్యంలో జోగి రమేశ్ జగన్‌ను కలిసి వివరణ ఇచ్చారు. అటు, జోగి రమేశ్‌తో కలిసి కార్యక్రమంలో పాల్గొనడంపై మంత్రి పార్థసారథి, ఎమ్మెల్యే గౌతు శిరీష, RTC ఛైర్మన్ కొనకళ్ల నారాయణపై TDP ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.

Similar News

News February 5, 2025

ChatGPT, డీప్‌సీక్‌పై నిషేధం

image

రహస్య సమాచారం, పత్రాలు లీకయ్యే ప్రమాదం ఉండటంతో ఛాట్‌జీపీటీ, డీప్‌సీక్ వంటి అన్ని రకాల AI టూల్స్ వాడకాన్ని ఫైనాన్స్ మినిస్ట్రీ నిషేధించింది. సంబంధిత ఆదేశాలను ఆ శాఖ కార్యదర్శి తుహిన్ కాంత పాండే ఆమోదించారు. ఆర్థిక వ్యవహారాలు, ఎక్స్‌పెండీచర్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్, దీపమ్, ఆర్థిక సేవల శాఖలకు లేఖలు పంపించారు. జనవరి 29న, కేంద్ర బడ్జెట్‌కు ముందు ఆదేశాలు ఇవ్వగా ఇప్పటికీ అమలు కొనసాగుతోంది.

News February 5, 2025

TTDలో అన్యమత ఉద్యోగులు బదిలీ

image

AP: టీటీడీలో అన్యమత ఉద్యోగులపై చర్యలు ప్రారంభమయ్యాయి. హిందూ మతేతర కార్యక్రమాల్లో పాల్గొంటూనే టీటీడీ ఉత్సవాల్లోనూ పాల్గొంటున్న 18 మంది ఉద్యోగులపై టీటీడీ క్రమశిక్షణ చర్యలకు ఆదేశించింది. ఇకపై వీరిని టీటీడీ ఆలయాల్లో ఉత్సవాలు, ఊరేగింపుల్లో విధులకు నియమించకూడదని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ 18 మందిని వెంటనే బదిలీ చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

News February 5, 2025

ఏపీ అసెంబ్లీకి లోక్‌సభ స్పీకర్

image

AP: అసెంబ్లీలో ఈ నెల 22 నుంచి రెండు రోజుల పాటు MLA, MLCలకు ఓరియంటేషన్ క్లాసులు నిర్వహించనున్నారు. ఇందుకోసం ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేశారు. ఓరియంటేషన్ క్లాసులను లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ప్రారంభించనుండగా, ఒక సెషన్‌లో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు మాట్లాడనున్నారు. ఈ క్లాసుల తర్వాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశాలున్నాయి.

error: Content is protected !!