News December 20, 2024

మతపరమైన పాలనపై సిరియాలో నిరసనలు

image

మతపరమైన పాలన తమకొద్దంటూ వందలాదిమంది సిరియా ప్రజలు నిరసనల బాట పట్టారు. రాజధాని డమాస్కస్‌లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద గుమిగూడి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు హక్కుల్ని కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటూ డిమాండ్ చేశారు. ‘50 ఏళ్లకు పైగా నియంతృత్వ పాలనలో నలిగిపోయాం. ఇప్పుడైనా మాకు లౌకిక, ప్రజాస్వామ్య పాలనను ఏర్పాటు చేయాలి’ అంటూ నినాదాలు చేశారు.

Similar News

News February 5, 2025

వివేకా హత్య కేసులో కీలక పరిణామం

image

AP: వివేకా హత్య కేసులో అప్రూవర్‌‌గా మారిన దస్తగిరి ఫిర్యాదు మేరకు పులివెందుల పోలీసులు నలుగురిపై కేసు నమోదు చేశారు. 2023లో తనను ఇబ్బంది పెట్టారని అతను ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు హత్య కేసులో నిందితుడిగా ఉన్న దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి కుమారుడు చైతన్య రెడ్డి, గతంలో జమ్మలమడుగు DSPగా పనిచేసిన నాగరాజు, ఎర్రగుంట్ల మాజీ CI ఈశ్వరయ్య, కడప జైలు మాజీ సూపరింటెండెంట్ ప్రకాశ్‌పై కేసులు నమోదయ్యాయి.

News February 5, 2025

హీరోపై కేసు నమోదు!

image

స్వయంవరం, చిరునవ్వుతో, హనుమాన్ జంక్షన్ వంటి సినిమాల్లో హీరోగా నటించిన వేణు తొట్టెంపూడిపై కేసు నమోదైంది. ఆయన ప్రతినిధిగా ఉన్న ‘ప్రోగ్రెసివ్ కన్‌స్ట్రక్షన్’ కంపెనీ ఉత్తరాఖండ్ జల విద్యుత్ ప్రాజెక్టుకు సంబంధించిన కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఈ క్రమంలో ఒప్పందాన్ని ఉల్లంఘించారని ఆయనతో పాటు సంస్థ సభ్యులపై కేసు నమోదు చేశారు. కాగా ఆయన రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు.

News February 5, 2025

ఇండియాలో కాలుష్యంపై బ్రయాన్ ఏమన్నారంటే?

image

అమెరికన్ మిలియనీర్ బ్రయాన్ జాన్సన్ ఇండియాలో పర్యటిస్తుండగా నిఖిల్ కామత్ ఇంటర్వ్యూ నుంచి మధ్యలోనే నిష్క్రమించడం చర్చనీయాంశమైంది. దీనికి కారణం కాలుష్యమేనని బ్రయాన్ చెప్పుకొచ్చారు. ‘గాలి నాణ్యత సరిగా లేకపోవడంతో నేను ఇంటర్వ్యూ మధ్యలో ఆపేశా. వాయుకాలుష్యం వల్ల నా చర్మంపై దద్దుర్లు వచ్చాయి. కళ్లు, గొంతు మండిపోతున్నాయి. నేను తెచ్చిన ఎయిర్ ప్యూరిఫయర్ కూడా కాలుష్యానికి పాడైంది’ అని చెప్పారు.

error: Content is protected !!