News December 20, 2024
మతపరమైన పాలనపై సిరియాలో నిరసనలు
మతపరమైన పాలన తమకొద్దంటూ వందలాదిమంది సిరియా ప్రజలు నిరసనల బాట పట్టారు. రాజధాని డమాస్కస్‌లోని ఉమయ్యద్ చౌరస్తా వద్ద గుమిగూడి తమ వ్యతిరేకతను వ్యక్తం చేశారు. మహిళలకు హక్కుల్ని కల్పించే ప్రజాస్వామ్య వ్యవస్థ రావాలంటూ డిమాండ్ చేశారు. ‘50 ఏళ్లకు పైగా నియంతృత్వ పాలనలో నలిగిపోయాం. ఇప్పుడైనా మాకు లౌకిక, ప్రజాస్వామ్య పాలనను ఏర్పాటు చేయాలి’ అంటూ నినాదాలు చేశారు.
Similar News
News January 22, 2025
పౌరసత్వంపై ట్రంప్ నిర్ణయం: కోర్టులో పిటిషన్
జన్మతః పౌరసత్వంపై ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై అమెరికాలోని న్యూ హ్యాంప్‌షైర్ డిస్ట్రిక్ కోర్టులో పిటిషన్ దాఖలైంది. ఇమ్మిగ్రెంట్స్ రైట్స్ అడ్వకేట్స్ అనే సంస్థ ఈ పిటిషన్ వేసింది. ట్రంప్ ప్రభుత్వం రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తోందని, ఇది అమెరికా ప్రతిష్ఠను దిగజార్చే ప్రయత్నమని పిటిషనర్లు పేర్కొన్నారు. రాజ్యాంగంలోని 14న సవరణ ప్రకారం అమెరికాలో పుట్టిన ప్రతి బిడ్డకు జన్మతః పౌరసత్వం లభిస్తుందని తెలిపారు.
News January 21, 2025
జన్మత: పౌరసత్వం రద్దు.. నెక్స్ట్ ఏంటి?
డొనాల్డ్ ట్రంప్ ఆటోమెటిక్ సిటిజన్‌షిప్ రద్దు చేయడంతో పిల్లలు 21 ఏళ్లు వచ్చేసరికి అమెరికా నుంచి బయటకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే స్టూడెంట్ వీసా తీసుకొని ఆ దేశంలో ఉన్నత విద్యను అభ్యసించవచ్చు. అయితే వారిని ఇంటర్నేషనల్ స్టూడెంట్లుగా పరిగణిస్తారు. ఫలితంగా ఉపకారవేతనాలు లాంటి యూనివర్సిటీ బెనెఫిట్స్ ఏమీ అందవు. మరోవైపు ఈ నిర్ణయంతో అమెరికాకు వెళ్లే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.
News January 21, 2025
రిజిస్టర్డ్ పార్టీకి, రికగ్నైజ్డ్ పార్టీకి తేడా ఇదే
అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో కనీసం 10 స్థానాల్లో పోటీ చేసిన పార్టీలను రిజిస్టర్డ్ పార్టీలుగా ఈసీ పరిగణిస్తుంది. ఇలాంటి పార్టీలకు ఎలాంటి ప్రయోజనాలు అందవు. వీరికి ఓ తాత్కాలిక గుర్తును కేటాయిస్తారు. అలాగే అసెంబ్లీ లేదా పార్లమెంట్ ఎన్నికల్లో 6 శాతం ఓట్లను పొందితే దానిని <<15218607>>గుర్తింపు పొందిన<<>> రాజకీయ పార్టీగా ఈసీ గుర్తిస్తుంది. ఈ పార్టీలకు గుర్తుతోపాటు కొన్ని ప్రత్యేకాధికారాలను ఈసీ కేటాయిస్తుంది.