News December 20, 2024

BRS కోతి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు: కాంగ్రెస్

image

TG: BRS కోతి చేష్టలను రాష్ట్ర సమాజం గమనిస్తోందని MLA వేముల వీరేశం అన్నారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేసి దళితుడైన గడ్డం ప్రసాద్‌ను అవమానించారన్నారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని BRS వ్యవహరిస్తోందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి పైకి దూసుకొచ్చారని తెలిపారు. అటు, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పు చూపించారని, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని BRS మండిపడుతోంది.

Similar News

News December 20, 2024

పాక్ కంటే బంగ్లాలోనే హిందువులపై దాడులు అధికం!

image

పాకిస్థాన్ కంటే బంగ్లాదేశ్‌లోనే హిందువుల‌పై దాడులు అధికంగా జ‌రిగినట్టు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2024లో పాక్‌లో హిందువుల‌పై 112 దాడి ఘ‌ట‌న‌లు జ‌రగ్గా, బంగ్లాలో 2,200 ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది. బంగ్లాలో షేక్ హ‌సీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్ర‌భుత్వం కూలిన త‌రువాత దాడులు పెరిగిన‌ట్టు వెల్ల‌డించింది. హిందువులు, మైనారిటీల రక్షణకు చర్యలు తీసుకోవాలని బంగ్లాను కోరామంది.

News December 20, 2024

ఇలా చేస్తే పిల్లలు పుట్టరు!: రీసెర్చ్

image

* ఫాస్ట్‌ఫుడ్ లాంటి ప్రాసెస్డ్ ఆహారం తినేవారిలో స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉన్నట్లు అధ్యయనాలు చెబుతున్నాయి.
* అధిక బరువు పెరిగిన వారిలో వీర్యకణాల ఉత్పత్తి మందగించేందుకు 81% అవకాశముంది.
* ల్యాప్‌టాప్ వంటి ఎలక్ట్రానిక్ డివైజ్‌లను ఎక్కువసేపు ఒడిలో పెట్టుకోవడం, తీవ్రమైన ఒత్తిడికి గురయ్యేవారిలో సంతానోత్పత్తి తగ్గిపోతుంది.
* స్మోకింగ్, ఆల్కహాల్ అలవాటు టెస్టోస్టెరాన్ స్థాయిని తగ్గిస్తుంది.

News December 20, 2024

రామ్‌చరణ్‌కు దేశంలోనే అతి పెద్ద కటౌట్.. ఎక్కడంటే?

image

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు ఆయన అభిమానులు దేశంలోనే అతిపెద్ద కటౌట్ నిర్మిస్తున్నారు. విజయవాడలోని బృందావన్ కాలనీలో ఉన్న వజ్రా గ్రౌండ్స్‌లో దీనిని ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 29న సాయంత్రం 4 గంటలకు ఈ కటౌట్‌ను ఆవిష్కరిస్తారు. కాగా ఇప్పటివరకు హీరో ప్రభాస్‌కు కట్టిన 230 అడుగుల కటౌటే దేశంలో అతి పెద్దదిగా ఉంది. ఇప్పుడు రామ్ చరణ్ కటౌట్ అంతకుమించి ఉంటుందని ఫ్యాన్స్ చెబుతున్నారు.