News December 20, 2024
BRS కోతి చేష్టలను ప్రజలు గమనిస్తున్నారు: కాంగ్రెస్
TG: BRS కోతి చేష్టలను రాష్ట్ర సమాజం గమనిస్తోందని MLA వేముల వీరేశం అన్నారు. కాగితాలు చింపి స్పీకర్‌పై వేసి దళితుడైన గడ్డం ప్రసాద్‌ను అవమానించారన్నారు. ఎలాగైనా సభ నుంచి బయటకు రావాలని BRS వ్యవహరిస్తోందన్నారు. ఆ పార్టీ ఎమ్మెల్యేలు మంత్రి పొంగులేటి పైకి దూసుకొచ్చారని తెలిపారు. అటు, షాద్ నగర్ ఎమ్మెల్యే శంకర్ తమకు చెప్పు చూపించారని, ఆయనపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని BRS మండిపడుతోంది.
Similar News
News January 23, 2025
సంజూపై కుట్ర పన్నుతున్నారు: తండ్రి
సంజూ శాంసన్‌ను బీసీసీఐ విచారించనుందన్న నేపథ్యంలో కేరళ క్రికెట్ అసోసియేషన్‌పై ఆయన తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. KCA సంజూపై కుట్ర పన్నుతోందని ఆరోపించారు. ‘6 నెలలుగా KCA కుట్రలు చేస్తోంది. అక్కడ నా బిడ్డ సురక్షితంగా లేడు. ప్రతిదానికి సంజూపై నిందలు వేస్తోంది. ప్రజలు కూడా వాటిని నమ్ముతున్నారు. అందుకే నా కొడుకు కేరళ తరఫున ఆడటం మానేయాలని నేను కోరుకుంటున్నా’ అని తెలిపారు.
News January 23, 2025
సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలు
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలను ఆర్కియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా షేర్ చేసింది. ‘ఇండియా కోసం నేతాజీ సిరా కూడా రక్తం చిందించింది. నేతాజీ సుభాష్ చంద్రబోస్ రాసిన అరుదైన లేఖలు మీరూ చూసేయండి. ఇవి లేఖలే కాదు స్వతంత్ర భారతదేశం గురించి ఆయన కలలుగన్న లక్ష్యాలు, సంకల్పం, దృక్పథానికి సాక్ష్యాలు’ అని తెలిపింది.
News January 23, 2025
స్విగ్గీ, జొమాటోకు షాకివ్వబోతున్న రెస్టారెంట్లు!
ప్రైవేటు లేబుల్ ఫుడ్ పేరుతో తమ వ్యాపారానికి కత్తెరేస్తున్న స్విగ్గీ, జొమాటోను నిలువరించేందుకు రెస్టారెంట్లు సిద్ధమవుతున్నాయి. కస్టమర్లకు ఫుడ్ డెలివరీ చేసేందుకు ONDC బాట పడుతున్నాయి. ఇప్పటికే గ్రౌండ్‌వర్క్ మొదలైందని NRAI తెలిపింది. దీంతో మళ్లీ తమ డిజిటల్ ఓనర్‌షిప్ పెరుగుతుందని, కస్టమర్ల డేటా యాక్సెస్‌కు వీలవుతుందని పేర్కొంది. తమపై కమీషన్, కస్టమర్లపై డెలివరీ ఛార్జీల భారం తగ్గుతుందని అంటోంది.