News December 20, 2024

బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’!

image

క్రికెట్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం సాధారణంగా బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి ఇస్తారు. కానీ వెస్టిండీస్‌ మాజీ క్రికెటర్ గస్ లోగీ ఆ రెండూ చేయకుండా ఫీల్డింగ్‌తో ఆ అవార్డు దక్కించుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. 1986లో పాక్‌తో జరిగిన ఛాంపియన్స్‌ ట్రోఫీ మ్యాచ్‌లో 3 అద్భుత క్యాచ్‌లు పట్టి 2 రనౌట్‌లు చేయడంతో ఆయనకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది.

Similar News

News December 21, 2024

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

image

అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని BC పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

News December 21, 2024

ప్రియాంక గాంధీ ఎన్నికను రద్దు చేయాలంటూ కోర్టులో పిటిషన్

image

ఇటీవల జరిగిన వయనాడ్ లోక్ సభ ఎన్నికలో ప్రియాంక గాంధీ ఎంపీగా ఎన్నికైన సంగతి తెలిసిందే. ఆమె ఎన్నికను రద్దు చేయాలంటూ బీజేపీ అభ్యర్థి నవ్య హరిదాస్ కోర్టులో పిటిషన్ వేశారు. నామినేషన్ సమయంలో ప్రియాంక తనతో పాటు తన కుటుంబ ఆస్థుల గురించి తప్పుడు సమాచారం ఇచ్చారని, ఓటర్లను మోసం చేసి గెలిచారని ఆరోపించారు. బై ఎలక్షన్‌లో ప్రియాంకకు 6.22లక్షల ఓట్లు రాగా, నవ్యకు 1.09లక్షల ఓట్లు పోలయ్యాయి.

News December 21, 2024

చలికాలంలో చన్నీటితో స్నానం చేస్తే..

image

చలికాలంలో చాలామంది వేడి నీటితో స్నానం చేసేందుకే ఇష్టపడతారు. కానీ చన్నీటితో చేస్తే ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. చన్నీటి స్నానం వల్ల శరీరంలో రోగనిరోధకశక్తి పెరుగుతుంది. కండరాలు బలంగా మారుతాయి. చర్మం మెరిసిపోతుంది. మెదడు చురుగ్గా పనిచేస్తుంది. ఒత్తిడి తగ్గి రిలాక్స్ ఫీల్ అవుతారు. ఆరోగ్యం బాగాలేని వారు చల్లని నీటికి బదులు వేడి నీటితోనే స్నానం చేయడం బెటర్.