News December 20, 2024
బ్యాటింగ్, బౌలింగ్ చేయకుండానే ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’!
క్రికెట్‌లో ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ పురస్కారం సాధారణంగా బ్యాటింగ్ లేదా బౌలింగ్‌లో అత్యుత్తమ ప్రదర్శన చేసిన ఆటగాడికి ఇస్తారు. కానీ వెస్టిండీస్ మాజీ క్రికెటర్ గస్ లోగీ ఆ రెండూ చేయకుండా ఫీల్డింగ్‌తో ఆ అవార్డు దక్కించుకున్న తొలి ఆటగాడిగా నిలిచారు. 1986లో పాక్‌తో జరిగిన ఛాంపియన్స్ ట్రోఫీ మ్యాచ్‌లో 3 అద్భుత క్యాచ్‌లు పట్టి 2 రనౌట్‌లు చేయడంతో ఆయనకు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ లభించింది.
Similar News
News January 24, 2025
Bad News.. అభిషేక్ శర్మకు గాయం!
ఇంగ్లండ్‌తో రెండో టీ20 ప్రారంభానికి ముందు భారత జట్టుకు ఎదురుదెబ్బ తగిలింది. ప్రాక్టీస్ సెషన్‌లో ఓపెనర్ అభిషేక్ శర్మకు మడమ గాయమైనట్లు క్రిక్ బజ్ పేర్కొంది. దీంతో రెండో టీ20లో ఆయన ఆడటంపై అనుమానాలు నెలకొన్నాయి. తొలి టీ20లో అభిషేక్ మెరుపు ఇన్నింగ్స్ ఆడిన సంగతి తెలిసిందే.
News January 24, 2025
రాజకీయాలు వీడుతున్నారని ప్రచారం.. స్పందించిన కొడాలి నాని
AP: ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని రాజకీయాలకు దూరం అవుతున్నారని తన పేరుతో వైరల్ అవుతున్న ట్వీట్ ఫేక్ అని మాజీ మంత్రి కొడాలి నాని కొట్టిపారేశారు. ఇలాంటి తప్పుడు ప్రచారం నమ్మొద్దని ఆయన పేర్కొన్నారు. కాగా వైసీపీకి రాజీనామా చేస్తున్నాడని, గుడివాడ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసినట్లుగా ఓ ట్వీట్ వైరలవుతోంది.
News January 24, 2025
2022లో ట్రంప్ ఉంటే యుద్ధమే ఉండేది కాదు: పుతిన్
రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై వ్లాదిమిర్ పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే 2022లో ఉక్రెయిన్ సంక్షోభం ప్రారంభమయ్యేదే కాదు. 2020లో ఆయన ఓడిపోవడం వల్ల పరిస్థితి మారింది’ అని వ్యాఖ్యానించారు. కాగా, యుద్ధం ఆపాలని ట్రంప్ నిన్న వ్యాఖ్యానించడంపై రష్యా స్పందించింది. వైట్ హౌస్ నుంచి సిగ్నల్ రాగానే పుతిన్ ట్రంప్‌తో చర్చలు ప్రారంభిస్తారని పేర్కొంది.