News December 20, 2024
తన తల్లిలా మరెవరూ చనిపోవద్దని..!

ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు అంబులెన్సు అందుబాటులో లేకపోవడంతో కరీముల్ హక్ అనే పశ్చిమ బెంగాల్‌కు చెందిన కార్మికుడు తన తల్లిని కోల్పోయాడు. దీంతో తన తల్లికి జరిగినట్లు మరెవరికీ అవ్వొద్దని ఆయన వినూత్న నిర్ణయం తీసుకున్నారు. బైక్‌ను అంబులెన్సుగా మార్చుకుని స్వగ్రామం ధలాబరితో పాటు చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు తక్షణ సేవలు అందిస్తూ 7వేల కంటే ఎక్కువ మందిని ఆయన కాపాడారు. ఆయనకు 2017లో పద్మశ్రీ వరించింది.
Similar News
News January 1, 2026
సుకన్య సమృద్ధి యోజన వడ్డీ రేటు ఎంతంటే?

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై వడ్డీ రేట్లను కేంద్రం యథాతథంగానే ఉంచింది. జనవరి-మార్చి త్రైమాసికానికి ఎలాంటి మార్పులు చేయలేదు. వరుసగా 8వ క్వార్టర్‌లోనూ వడ్డీ రేట్లను సవరించకపోవడం గమనార్హం. సుకన్య సమృద్ధి యోజన-8.2%, మూడేళ్ల టర్మ్ డిపాజిట్, PPF-7.1%, పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీమ్స్-4%, కిసాన్ వికాస్ పాత్ర-7.5, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్-7.7, మంత్లీ ఇన్‌కమ్ స్కీమ్-7.4% వడ్డీ రేట్లు ప్రస్తుతమున్నాయి.
News January 1, 2026
ఒత్తువాములు కోరుతుంది, పలచన పాతర్లు కోరుతుంది

వాము (ఓమ) పంటను సాగు చేసేటప్పుడు మొక్కలు దగ్గర దగ్గరగా (ఒత్తుగా) ఉండాలి. అప్పుడే ఆ పంట దిగుబడి బాగుంటుంది. పాతర్లు (అంటే వరి నారు లేదా ఇతర కొన్ని రకాల పంటలు) నాటేటప్పుడు మొక్కల మధ్య తగినంత దూరం (పలచనగా) ఉండాలి. అప్పుడే ఆ మొక్కలకు గాలి, వెలుతురు సరిగా తగిలి ఆరోగ్యంగా పెరుగుతుంది. ఏ పంటకు ఎంత దూరం ఉండాలో తెలిపే వ్యవసాయ సూత్రాన్ని ఈ సామెత చెబుతుంది.
News January 1, 2026
కొత్త ఏడాదిలో.. సంపద కోసం!

లక్ష్మీదేవి నివాసంగా భావించే వికసించే చెట్టు ఆకును, అలాగే శుభప్రదమైన బియ్యం గింజలను పర్సులో ఉంచుకోవడం వల్ల ధన వృద్ధి కలుగుతుందని పండితులు చెబుతున్నారు. లక్ష్మీ స్వరూపమైన గవ్వలు, తామర గింజలను ఎర్రటి గుడ్డలో కట్టి పర్సు/బీరువాలో భద్రపరుచుకోవడం వల్ల డబ్బు నిలకడగా ఉంటుందని నమ్మకం. గోసేవ చేస్తే దైవానుగ్రహం లభించి ఏడాది పొడవునా మీ ఇంట్లో దారిద్ర్యం తొలగి సుఖసంతోషాలు వెల్లివిరుస్తాయని ప్రగాఢ విశ్వాసం.


