News December 20, 2024
ఆ అటార్నీ జనరల్ త్వరలో రాజీనామా
అదానీపై అమెరికా న్యాయ శాఖ మోపిన లంచాల అభియోగాల కేసును డీల్ చేస్తున్న బ్రూక్లిన్ అటార్నీ జనరల్ బ్రియాన్ పీస్ తన పదవికి Jan 10న రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పీస్ కొన్ని హైప్రొఫైల్ కేసులను వాదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అటార్నీగా USకు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. 2021లో బైడెన్ ఆయన్ను నియమించగా, ట్రంప్ బాధ్యతలు చేపట్టడానికే ముందే రాజీనామా చేయనున్నారు.
Similar News
News February 5, 2025
దానం నివాసంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల భేటీ!
TG: అసెంబ్లీ సెక్రటరీ నోటీసుల నేపథ్యంలో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు దానం నాగేందర్ నివాసంలో ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో సమావేశమయ్యారు. న్యాయపరంగా ముందుకెళ్లే అంశం, అసెంబ్లీ సెక్రటరీ, సుప్రీంకు సమాధానం ఇవ్వడంపై చర్చిస్తున్నట్లు సమాచారం. అవసరమైతే ఢిల్లీకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది.
News February 5, 2025
అకౌంట్లలోకి రైతుభరోసా డబ్బులు
TG: రైతుభరోసా నిధుల జమను రాష్ట్ర ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో రైతుల అకౌంట్లలో ఇవాళ్టి నుంచి డబ్బులు జమ చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. ఒక ఎకరం వరకు సాగులో ఉన్న భూములకు మొత్తం 17.03 లక్షల రైతుల ఖాతాల్లో ఇవాళ నిధులు జమ అవుతాయన్నారు.
News February 5, 2025
రేపు ఎమ్మెల్యేలతో రేవంత్, మున్షీ భేటీ
TG: రేపు కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ రాష్ట్ర అధిష్ఠానం భేటీ కానుంది. వారిని నాలుగు గ్రూపులుగా విడదీసి సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర ఇంఛార్జి దీపాదాస్ మున్షీ, పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ సమావేశం కానున్నారు. ఇటీవల జరుగుతున్న పరిణామాలు, కులగణనపై ప్రచారం వంటి అంశాలపై చర్చించనున్నట్లు తెలుస్తోంది.