News December 20, 2024

ఆ అటార్నీ జనరల్ త్వరలో రాజీనామా

image

అదానీపై అమెరికా న్యాయ శాఖ మోపిన లంచాల అభియోగాల కేసును డీల్ చేస్తున్న బ్రూక్లిన్ అటార్నీ జనరల్ బ్రియాన్ పీస్ తన పదవికి Jan 10న రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. పీస్ కొన్ని హైప్రొఫైల్ కేసులను వాదించి ప్రత్యేక గుర్తింపు పొందారు. అటార్నీగా USకు సేవ‌లందించ‌డం గౌర‌వంగా భావిస్తున్న‌ట్టు పేర్కొన్నారు. 2021లో బైడెన్ ఆయ‌న్ను నియ‌మించ‌గా, ట్రంప్ బాధ్య‌తలు చేప‌ట్ట‌డానికే ముందే రాజీనామా చేయ‌నున్నారు.

Similar News

News January 25, 2025

PHOTOS: ‘మహాకుంభ్’లో డ్రోన్ షో

image

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో కుంభ మేళా సందర్భంగా డ్రోన్ షో నిర్వహించారు. 2,500 ‘మేడ్ ఇన్ ఇండియా’ డ్రోన్‌లను ఉపయోగించి భారతీయ పౌరాణిక చరిత్ర, సంప్రదాయాలను ప్రదర్శించారు. డ్రోన్‌లతో తీర్చిదిద్దిన శివుడు, శంఖం వంటి రూపాలు ఆకట్టుకున్నాయి.

News January 25, 2025

బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దు: హైకోర్టు

image

TG: రాష్ట్రంలో సినిమాల బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వొద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అర్ధరాత్రి 1.30 గంటల నుంచి ఉ.8.40 గంటల మధ్య ఎలాంటి షోలకు అనుమతి ఇవ్వొద్దని తెలిపింది. ‘గేమ్ ఛేంజర్’ సినిమా టికెట్ రేట్ల పెంపుపై దాఖలైన పిటిషన్‌పై విచారించింది. రేట్ల పెంపు అనుమతులను రద్దు చేసినట్లు ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. తదుపరి విచారణను కోర్టు ఫిబ్రవరి 21కి వాయిదా వేసింది.

News January 25, 2025

రాజకీయాల్లోకి త్రిష? తల్లి ఏమన్నారంటే?

image

సినీ నటి త్రిష త్వరలో రాజకీయాల్లోకి రాబోతున్నట్లు జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తల్లి ఉమా కృష్ణన్ ఖండించారు. త్రిష సినిమాలను వదిలేస్తారన్న వార్తల్లో నిజం లేదని, ఆమె ఫిల్మ్ ఇండస్ట్రీలోనే కొనసాగుతారని స్పష్టం చేశారు. అయితే సినిమాలను వదిలేయడంపై త్రిష, ఆమె తల్లికి మధ్య వివాదం జరిగినట్లు ఇటీవల ఓ తమిళ సినిమా క్రిటిక్ పేర్కొన్నారు. దీనిపై త్రిష నుంచి స్పష్టత రావాల్సి ఉంది.