News December 20, 2024
Bears బ్యాటింగ్.. Bulls హ్యాండ్స్ అప్

స్టాక్ మార్కెట్లకు ఈ వారం ఓ పీడకలే అని చెప్పాలి. బెంచ్ మార్క్ సూచీలు రెడ్ తప్ప గ్రీన్‌లో ముగిసిన రోజంటూ లేకుండాపోయింది. Sensex 4 వేల పాయింట్లు, Nifty 1,200 పాయింట్లు నష్టపోయాయి. సూచీల్లో 5% మేర తరుగుదల కనిపించింది. Over Valuation భయాలు, Fed కఠిన నిర్ణయాల సూచనలు, క్రిస్మస్ సెలవులతో FIIల డిజిన్వెస్ట్‌మెంట్ (ఈ రోజు -3597 Cr), వీక్ కార్పొరేట్ ఎర్నింగ్స్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.
Similar News
News January 31, 2026
T20WCకు ప్యాట్ కమిన్స్ దూరం

గాయం కారణంగా AUS స్టార్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్ T20WCకు దూరమయ్యారు. గతంలో ప్రకటించిన జట్టులో 2 మార్పులు చేశారు. AUS సెలక్టర్లు కమిన్స్, మాథ్యూ షార్ట్ స్థానంలో పేసర్ బెన్ ద్వార్షుయిస్, మాట్ రెన్‌షాలకు అవకాశం కల్పించారు.
AUS జట్టు: మార్ష్(C), బార్ట్‌లెట్, కూపర్, టిమ్ డేవిడ్, బెన్ ద్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, హేజిల్‌వుడ్, హెడ్, కుహ్నెమన్, మ్యాక్స్‌వెల్, స్టోయినిస్, జంపా, రెన్‌షా, ఇంగ్లిస్.
News January 31, 2026
విటమిన్ D ఉండే ఆహారాలు

మన ఇమ్యూనిటీ పెంచేందుకు విటమిన్ D చాలా అవసరం. విటమిన్ డి స్థాయి తక్కువగా ఉన్నవారికి శరీర పెరుగుదల ఆగిపోతుంది. చలికాలంలో ఎక్కువ ఎండ అందుబాటులో లేని ప్రదేశాల్లో విటమిన్ డి లభించదు అలాంటప్పుడు కొన్ని విటమిన్ డి ఉన్న ఆహార పదార్థాలు తీసుకోవాలి. అవి సాల్మన్, రెడ్ మీట్, గుడ్డు సొన, లివర్‌లో ఎక్కువగా విటమిన్ డి ఉంటుంది. ఇలా కాకుండా సప్లిమెంట్లు వాడాలనుకుంటే తప్పనిసరిగా వైద్యుల సలహా తీసుకోవాలి.
News January 31, 2026
కల్తీ నెయ్యి వివాదం.. రాష్ట్రవ్యాప్తంగా YCP పూజలు

AP: కల్తీ నెయ్యి వివాదంలో దుష్ప్రచారం చేస్తున్నారని, భక్తుల మనోభావాలతో ఆడుకున్న CBN, పవన్‌కు భగవంతుడే బుద్ధి చెప్తారని YCP నేతలు చెప్పారు. వారి వ్యాఖ్యలను నిరసిస్తూ పాప పరిహార పూజలు చేస్తున్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో పార్టీ జిల్లా ఇన్‌ఛార్జ్ వంగా గీత, తూ.గో జిల్లా తణుకులో మాజీ మంత్రి కారుమూరి, YSR జిల్లా బద్వేలులో MLA దాసరి సుధ, NTR జిల్లా YCP అధ్యక్షుడు దేవినేని ప్రత్యేక పూజలు చేశారు.


