News December 20, 2024
Bears బ్యాటింగ్.. Bulls హ్యాండ్స్ అప్
స్టాక్ మార్కెట్లకు ఈ వారం ఓ పీడకలే అని చెప్పాలి. బెంచ్ మార్క్ సూచీలు రెడ్ తప్ప గ్రీన్‌లో ముగిసిన రోజంటూ లేకుండాపోయింది. Sensex 4 వేల పాయింట్లు, Nifty 1,200 పాయింట్లు నష్టపోయాయి. సూచీల్లో 5% మేర తరుగుదల కనిపించింది. Over Valuation భయాలు, Fed కఠిన నిర్ణయాల సూచనలు, క్రిస్మస్ సెలవులతో FIIల డిజిన్వెస్ట్‌మెంట్ (ఈ రోజు -3597 Cr), వీక్ కార్పొరేట్ ఎర్నింగ్స్ సెంటిమెంట్‌ను బలహీనపరిచాయి.
Similar News
News January 13, 2025
కౌశిక్ రెడ్డిపై స్పీకర్‌కు సంజయ్ ఫిర్యాదు
TG: ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అసెంబ్లీ స్పీకర్ ప్రసాద్ కుమార్‌కు ఫిర్యాదు చేశారు. అధికారిక సమావేశంలో తనను దుర్భాషలాడారని, ప్రజా సమస్యలపై మాట్లాడుతుంటే అడ్డుకున్నారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. కౌశిక్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరారు. నివేదిక తెప్పించుకుని చర్యలు తీసుకుంటానని ఆయనకు స్పీకర్ బదులిచ్చారు.
News January 13, 2025
ఛాంపియన్స్ ట్రోఫీ: సౌతాఫ్రికా టీమ్ ఇదే
ఛాంపియన్స్ ట్రోఫీ-2025 కోసం సౌతాఫ్రికా టీంను ఆ దేశ క్రికెట్ బోర్డు ప్రకటించింది.
టీమ్: టెంబా బవుమా (C), ట్రిస్టన్ స్టబ్స్, టోనీ డి జోర్జి, వన్ డర్ డస్సెన్, రికెల్టన్, డేవిడ్ మిల్లర్, మార్క్రమ్, ముల్డర్, క్లాసెన్, కేశవ్ మహారాజ్, షంసీ, ఎంగిడి, మార్కో జాన్సెన్, కగిసో రబాడ, నోర్ట్జే.
News January 13, 2025
తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి దారుణం!
AP: అనకాపల్లి జిల్లా ఏటికొప్పాకలో ఐదేళ్ల చిన్నారిని 13 ఏళ్ల బాలుడు (8వ తరగతి) అత్యాచారం చేశాడు. శనివారం ఇంటి సమీపంలో ఆడుకుంటున్న బాలికపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. తల్లి ఫోన్లో పోర్న్ వీడియో చూసి అత్యాచారానికి పాల్పడ్డట్లు బాలుడు పోలీసులతో చెప్పినట్లు సమాచారం.