News December 21, 2024

అల్లు అర్జున్‌పై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు

image

అల్లు అర్జున్‌తో పాటు ‘పుష్ప-2’ నిర్మాతలు, సంధ్య థియేటర్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని BC పొలిటికల్ JAC ఛైర్మన్ యుగంధర్ గౌడ్ డిమాండ్ చేశారు. సినిమా ప్రచారం కోసం థియేటర్‌కు వెళ్లి ఓ మహిళ చావుకు కారణమయ్యారని ఢిల్లీలో జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. తొక్కిసలాట ఘటనలో రేవతి చనిపోగా, ఆమె కుమారుడు శ్రీతేజ్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే.

Similar News

News December 21, 2024

నేటితో ముగియనున్న అసెంబ్లీ, మండలి సమావేశాలు

image

TG: అసెంబ్లీ, మండలి సమావేశాలు ఇవాళ్టితో ముగియనున్నాయి. ఈనెల 9న ప్రారంభమైన సమావేశాలు 16కు వాయిదా పడ్డాయి. 16న తిరిగి ప్రారంభమై నేడు ముగియనున్నాయి. ఈరోజు రైతు భరోసా పథకంపై అసెంబ్లీ, శాసన మండలిలో చర్చించనున్నారు. అనంతరం మంత్రివర్గం విధి విధానాలు ఖరారు చేసి, సంక్రాంతి తర్వాత నుంచి రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేయనున్నట్లు తెలుస్తోంది.

News December 21, 2024

స్థానిక సంస్థల ఎన్నికలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

image

TG: ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగి ఉన్న వారు స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రూల్‌ను మార్చాలంటూ వచ్చిన ప్రతిపాదనను రిజెక్ట్ చేసింది. ఈ నిబంధన మినహా ఇతర అంశాలతో పంచాయతీ రాజ్ చట్ట సవరణ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టగా సభ ఆమోదం తెలిపింది. కాగా ఏపీలో ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించిన సంగతి తెలిసిందే.

News December 21, 2024

‘భరణం’ పేరిట భర్తను భార్య దోచుకోకూడదు: సుప్రీం

image

భరణమనేది స్త్రీ సంక్షేమాన్ని ఉద్దేశించి ఇప్పించేది మాత్రమే తప్ప తమ మాజీ భర్తను బెదిరించేందుకు దాన్ని భార్యలు ఉపయోగించుకోకూడదని సుప్రీం కోర్టు తేల్చిచెప్పింది. భర్త ఆస్తి, ఆదాయానికి తగిన మనోవర్తి కోరడం సరికాదంది. భర్తకు రూ.5 వేల కోట్ల ఆస్తి ఉందని, అందుకు తగినట్లుగా భరణం ఇప్పించాలని ఓ మహిళ వేసిన పిటిషన్‌ను సుప్రీం తోసిపుచ్చింది. వన్‌టైమ్ సెటిల్మెంట్‌గా రూ.12 కోట్లు భరణం ఇవ్వాలని భర్తను ఆదేశించింది.