News December 21, 2024
MCGలో ప్రాక్టీస్ ప్రారంభించిన టీమ్ ఇండియా
భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య BGT నాలుగో టెస్ట్ ఈనెల 26 నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఇవాళ ఉదయం అక్కడ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 3 టెస్టులు జరగ్గా ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. WTC ఫైనల్ చేరాలంటే భారత్ చివరి రెండు టెస్టులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రోహిత్, కోహ్లీ ఫామ్ లేమి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.
Similar News
News December 21, 2024
కేటీఆర్ ఆ విషయాన్ని నిరూపిస్తే రాజీనామా చేస్తా: వెంకట్‌రెడ్డి
24 గంటలు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం తమదేనన్న KTR వ్యాఖ్యల్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తప్పుబట్టారు. ‘11 నుంచి 13 గంటలు మాత్రమే కరెంట్ ఇచ్చారు. నేను స్వయంగా గ్రామాల్లో తిరిగి తెలుసుకున్నాను. కేటీఆర్ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలి. రైతు బంధుతో సాగు పెరిగిందని KTR అంటున్నారు. నల్గొండ జిల్లాలో ఒక్క ఎకరా ఆయకట్టు పెరిగినట్లు నిరూపించినా రాజీనామా చేస్తా’ అని సవాల్ చేశారు.
News December 21, 2024
‘గేమ్ ఛేంజర్’ ఈవెంట్‌కు చిరు, పవన్?
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, కియారా అద్వానీ జంటగా తెరకెక్కుతోన్న ‘గేమ్ ఛేంజర్’ సినిమా నుంచి ఈనెల 27న ట్రైలర్ విడుదల కానున్నట్లు సినీవర్గాలు పేర్కొన్నాయి. దీంతోపాటు ఏపీలో ప్రీరిలీజ్ ఈవెంట్‌ను ఏర్పాటు చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ ఈవెంట్‌కు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో పాటు మెగాస్టార్ చిరంజీవి హాజరుకానున్నట్లు సమాచారం. దీనిపై త్వరలోనే మేకర్స్ ప్రకటన చేయనున్నారు.
News December 21, 2024
సీఎంను ఏకవచనంతో మాట్లాడొద్దు: కేటీఆర్‌తో స్పీకర్
సీఎం రేవంత్ రెడ్డికి గౌరవం ఇవ్వాలని KTRకు స్పీకర్ సూచించారు. సభానాయకుడైన రేవంత్‌ను ఏకవచనంతో మాట్లాడొద్దని పేర్కొన్నారు. గౌరవమనేది ఇచ్చి పుచ్చుకోవాలని, తమకు గౌరవమిస్తే తాము కూడా గౌరవంగా మాట్లాడతామని కేటీఆర్ జవాబిచ్చారు. ‘మా నాయకుడు కేసీఆర్‌ను వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే మేం కూడా అదే తరహాలో స్పందిస్తాం. నేనేం తిట్టట్లేదు కదా? పేరు పెట్టి పిలిచాను అంతే కదా?’ అంటూ వివరణ ఇచ్చారు.