News December 21, 2024

MCGలో ప్రాక్టీస్ ప్రారంభించిన టీమ్ ఇండియా

image

భారత్, ఆస్ట్రేలియా జట్ల మధ్య BGT నాలుగో టెస్ట్ ఈనెల 26 నుంచి మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్‌లో జరగనుంది. ఈ నేపథ్యంలో టీమ్ ఇండియా ఇవాళ ఉదయం అక్కడ ప్రాక్టీస్ చేయడం మొదలెట్టింది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకు 3 టెస్టులు జరగ్గా ఇరు జట్లు చెరో విజయంతో సమంగా ఉన్నాయి. WTC ఫైనల్ చేరాలంటే భారత్ చివరి రెండు టెస్టులు గెలవాల్సిన పరిస్థితి ఏర్పడింది. మరోవైపు రోహిత్, కోహ్లీ ఫామ్ లేమి ఫ్యాన్స్‌ను కలవరపెడుతోంది.

Similar News

News January 23, 2025

త్వరలోనే రాష్ట్రానికి కాగ్నిజెంట్: లోకేశ్

image

AP: ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థ కాగ్నిజెంట్ నుంచి త్వరలోనే శుభవార్త రాబోతుందని మంత్రి నారా లోకేశ్ తెలిపారు. దావోస్‌లో కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్‌తో ఆయన సమావేశమయ్యారు. ‘రాష్ట్రంలోని వైజాగ్, విజయవాడ, తిరుపతిలో భారీగా కోవర్కింగ్ స్పేస్ ఉంది. కాగ్నిజెంట్ విస్తరణలో భాగంగా ఇక్కడ కూడా కార్యాలయాలు ఏర్పాటు చేయాలని కోరాం. దీనిపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆ సంస్థ సీఈఓ తెలిపారు’ అని పేర్కొన్నారు.

News January 23, 2025

ఓలా, ఉబర్‌ సంస్థలకు కేంద్రం నోటీసులు

image

క్యాబ్‌ బుక్‌ చేసుకునేవారికి మొబైల్ ఫోన్ల ఆధారంగా ఛార్జ్ వేస్తున్నారనే <<15225725>>ఫిర్యాదులపై<<>> కేంద్రం చర్యలకు దిగింది. దీనిపై వివరణ ఇవ్వాలని ఓలా, ఉబర్ సంస్థలకు నోటీసులు జారీ చేసింది. ఒకే రకమైన సేవకు వేర్వేరు ఛార్జీలు వసూలు చేయడంపై స్పందించాలని కోరింది. ఐఫోన్‌లో రైడ్‌ బుక్‌ చేస్తే ఒకలా, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో బుక్‌ చేస్తే ఇంకొకలా ఛార్జీలు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే.

News January 23, 2025

పాపడాలు అమ్మి రోజుకు రూ.10వేలు సంపాదన

image

పొట్టకూటి కోసం పాపడాలమ్మే చక్రధర్ రాణా రోజుకు రూ.10వేలు సంపాదిస్తున్నారని తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఒడిశాలోని మయూర్‌భంజ్ జిల్లాలో ఉడాలా వీధుల్లో ఈయన 50 ఏళ్లుగా పాపడాలు అమ్ముతున్నారు. రోజూ 30-40 కిలోమీటర్లు నడిచి స్థానిక మార్కెట్‌లో విక్రయిస్తుంటారు. ఒక్కటి రూ.10 చొప్పున రోజూ వెయ్యి పీసులు అమ్మి రూ.10వేలు సంపాదిస్తున్నారు. తొలినాళ్లలో ఒక్కోటి 5 పైసలకు అమ్మేవారు.