News December 21, 2024

TGలో మరో అగ్రికల్చర్ కాలేజీ.. ఎక్కడంటే?

image

తెలంగాణలో మరో అగ్రికల్చర్ కాలేజీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సూర్యాపేట (D) హుజూర్ నగర్ మఠంపల్లిలో దీనిని నిర్మించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకోసం 100 ఎకరాల భూమిని సేకరిస్తున్నట్లు సమాచారం. భూ సేకరణ పూర్తికాగానే ప్రభుత్వం కాలేజీని మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం రాష్ట్రంలో 8 వ్యవసాయ కళాశాలలున్నాయి.

Similar News

News December 21, 2024

పొలాలకు రోడ్లు వేయండి: పాయల్ శంకర్

image

TG: పొలాలకు వెళ్లే రోడ్ల కోసం బడ్జెట్‌లో నిధులు కేటాయించాలని ప్రభుత్వాన్ని ఆదిలాబాద్ MLA పాయల్ శంకర్ కోరారు. ‘పొలానికి ఎరువులు తీసుకెళ్లాలన్నా, కూలీలను తరలించాలన్నా సరైన రవాణా సౌకర్యాలు లేవు. ప్రస్తుతం ఏ రైతులు సంతోషంగా లేరు. పరిశ్రమలు పెట్టే వాళ్లకు రాయితీలు ఇస్తున్నాం. అందరికీ అన్నం పెట్టే రైతులకు న్యాయం చేయలేకపోతున్నాం. రైతుల పిల్లలకు 90% రాయితీతో కార్పొరేట్ విద్య, వైద్యం అందించాలి’ అని కోరారు.

News December 21, 2024

మోడల్ స్కూళ్లలో ప్రవేశాలు.. షెడ్యూల్ విడుదల

image

TG: 194 మోడల్ స్కూళ్లల్లో అడ్మిషన్ల కోసం షెడ్యూల్ విడుదలైంది. 6 నుంచి 10వ తరగతుల్లో ప్రవేశానికి జనవరి 6 నుంచి ఫిబ్రవరి 28 వరకు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ నెల 23న నోటిఫికేషన్ రిలీజ్ కానుంది. 2025 ఏప్రిల్ 13న ఎంట్రన్స్ పరీక్ష జరగనుంది. 6వ క్లాసులో అన్ని సీట్లకు, 7-10వ తరగతి వరకు ఖాళీలు ఉంటేనే భర్తీ చేస్తారు. SC, ST, BC, దివ్యాంగులు, EWS విద్యార్థులు రూ.125, ఓసీలు రూ.200 చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి.

News December 21, 2024

మై ఓల్డ్ ఫ్రెండ్ సొరోస్: థరూర్‌కు పంచ్ ఇచ్చిన పూరీ

image

కాంగ్రెస్ MP శశిథరూర్‌కు OGM హర్దీప్‌పూరీ గట్టి పంచ్ ఇచ్చారు. లండన్‌లో 2009లో UN అంబాసిడర్‌గా ఎంపికైనప్పుడు తానిచ్చిన విందుకు జార్జి సొరోస్ సహా అతిథుల జాబితాను ఇచ్చిందే ఆయనని తెలిపారు. కాంగ్రెస్‌లోని కొందరు మిత్రులు వంచనను ఆర్టిక్యులేట్ చేయడంలో నిష్ణాతులని ఎద్దేవా చేశారు. RG ఫౌండేషన్‌కు దాత కాబట్టే పేరు రాసిచ్చారని పేపర్లను షేర్ చేశారు. సొరోస్, RGF గురించి తనకేం తెలియదని <<14896129>>థరూర్ <<>>వివరణ ఇచ్చారు.