News December 21, 2024
గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు కీలక ఆదేశాలు
AP: గ్రామ, వార్డు సచివాలయాల్లో పనిచేసే ఉద్యోగులకు బయోమెట్రిక్ హాజరు ఆధారంగా వేతనాలు ఇవ్వనున్నారు. ఈ మేరకు డీడీవోలకు గ్రామ, వార్డు సచివాలయ శాఖ తాజాగా ఆదేశాలిచ్చింది. మొబైల్ యాప్‌లో ఉద్యోగులు నమోదు చేసిన హాజరునే పరిగణనలోకి తీసుకోవాలని స్పష్టం చేసింది.
Similar News
News December 21, 2024
సినీ స్టార్లపై సీఎం రేవంత్ ఫైర్
TG: అరెస్ట్ చేయడానికి వెళ్లిన పోలీసులతో హీరో అల్లు అర్జున్ దురుసుగా ప్రవర్తించారని CM రేవంత్ మండిపడ్డారు. బన్నీ బాధ్యతరాహిత్యంగా వ్యవహరించారని ఆరోపించారు. ‘సంధ్య థియేటర్‌కు హీరో, హీరోయిన్ రావొద్దని చెప్పాం. వారు అక్కడికి వచ్చి తొక్కిసలాటకు కారణమయ్యారు. తల్లి చనిపోయి, కుమారుడు చావు బతుకుల్లో ఉంటే ఒక్క సినీ స్టార్ పరామర్శించలేదు. నటుడిని అరెస్ట్ చేస్తే ఇంత రాద్ధాంతం ఎందుకు?’ అని ఫైర్ అయ్యారు.
News December 21, 2024
నేను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదు: CM రేవంత్
TG: తాను తండ్రి పేరు చెప్పుకొని ఇక్కడికి రాలేదని, జిల్లా స్థాయి నుంచి సీఎం స్థాయికి ఎదిగానని రేవంత్ రెడ్డి అన్నారు. ‘రీజినల్ రింగ్ రోడ్, ఫ్యూచర్ సిటీ, మెట్రో విస్తరణ చేపట్టాలా? వద్దా?. కొడంగల్‌లో 1300 ఎకరాల భూసేకరణ చేసి, అక్కడి యువతకు ఉపాధి కల్పించాలనుకుంటే అడ్డుకుంటున్నారు. నేను పులులు తిరిగే ప్రాంతం నుంచి వచ్చాను’ అని రేవంత్ అన్నారు. అటు, GHMC సవరణ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపింది.
News December 21, 2024
రండి.. గన్‌మెన్లు లేకుండా వెళ్దాం: రేవంత్
TG: మూసీ మురుగు నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కల్పిద్దామంటే BRS కాళ్లలో కట్టెలు పెడుతోందని CM రేవంత్ మండిపడ్డారు. ‘ఆ జిల్లా మహిళలు గర్భం దాల్చేందుకూ భయపడుతున్నారు. మూసీ పునరుజ్జీవం వద్దని ప్రజలు చెబుతున్నారని BRS అంటోంది. రండి.. KTR వస్తారో? హరీశ్ వస్తారో? నేను కూడా గన్‌మెన్లు లేకుండా వస్తా. నల్గొండ పోదామా? భువనగిరి పోదామా? ఆలేరు పోదామా? మూసీ పునరుజ్జీవం కావాలో, వద్దో అడుగుదాం?’ అని అన్నారు.