News December 21, 2024
టీ, కాఫీ తాగే వారికి అలర్ట్!
రోజుకో కప్పు కాఫీ తాగితే ఆయుష్షు పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. మగవారు రోజుకు 3-5 కప్పుల కాఫీ తాగితే ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయని నిపుణులు సూచిస్తున్నారు. అయితే, అంతకుమించితే ప్రమాదమని హెచ్చరిస్తున్నారు. కెఫిన్ రోజుకు 400mg వరకు మాత్రమే తీసుకోవాలి. టీ, కూల్ డ్రింక్స్, ఎనర్జీ డ్రింక్స్‌లో కెఫిన్ ఉంటుంది. గర్భిణులు, పాలిచ్చే తల్లులు 200mg కంటే ఎక్కువ తీసుకోకూడదు.
Similar News
News December 22, 2024
మెగాస్టార్ తర్వాతి సినిమా తమిళ డైరెక్టర్‌తో?
మెగాస్టార్ చిరంజీవి వరుసగా యువ దర్శకులకు అవకాశాలిస్తున్నారు. వశిష్టతో ‘విశ్వంభర’ రెడీ అవుతుండగా శ్రీకాంత్ ఓదెలతో మూవీకీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అనిల్ రావిపూడితోనూ ఓ మూవీ పట్టాలెక్కే అవకాశం ఉంది. వీరి తర్వాత తమిళ దర్శకుడు మిత్రన్‌తో మూవీ చేసే ఛాన్స్ ఉందని తెలుస్తోంది. ఆయన కార్తీతో ‘సర్దార్’ సినిమాను తీశారు. మిత్రన్ చెప్పిన స్టోరీ లైన్ చిరుకు నచ్చిందని, పూర్తి కథను డెవలప్ చేయమని సూచించారని సమాచారం.
News December 22, 2024
భారత్‌పై మరోసారి బంగ్లా ఆరోపణలు
మాజీ ప్రధాని షేక్ హసీనా హయాంలో ప్రజలు అదృశ్యమైన ఘటనల్లో భారత్ హస్తం ఉందని బంగ్లా ప్రభుత్వ ఎంక్వైరీ కమిషన్ ఆరోపించింది. బంగ్లా ఖైదీలు భారతీయ జైళ్లలో మగ్గుతున్నారని పేర్కొంది. భారత్‌లో నిర్బంధంలో ఉన్న తమ జాతీయులను గుర్తించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని బంగ్లాదేశ్ విదేశాంగ, హోం శాఖలకు కమిషన్ సిఫార్సు చేసింది. తమ పౌరులు 3,500 మంది అదృశ్యమైనట్టు కమిషన్ అంచనా వేసింది.
News December 22, 2024
రైల్వేలో పోస్టులు.. వివరాలివే
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వివిధ విభాగాల్లో 1036 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వచ్చే ఏడాది జనవరి 7- ఫిబ్రవరి 6 మధ్యలో తమ <