News December 22, 2024
అమెరికాలో పెగాసస్ ప్రకంపనలు
పెగాసస్ స్పైవేర్ మళ్లీ వెలుగులోకొచ్చింది. ఈ స్పైవేర్‌ను వృద్ధి చేసిన Israel కంపెనీ NSO చట్ట వ్యతిరేక చర్యలను USలోని ఓ కోర్టు మొదటిసారిగా గుర్తించింది. WhatsApp వేసిన కేసులో 1400 మంది యూజర్లపై దీన్ని వాడినట్టు కోర్టు నిర్ధారించింది. 2021లో 300 మందిపై NDA Govt నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు కమిటీ విచారించింది. విచారణలో కేంద్రం తమకు సహకరించలేదని కమిటీ తెలిపింది.
Similar News
News December 22, 2024
రూ.5,000 కోట్లతో జెఫ్ బెజోస్ మళ్లీ పెళ్లి
అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లిపీటలెక్కుతున్నారు. ఈ నెల 28న తన గర్ల్ ఫ్రెండ్ లారెన్ సాంచెజ్ను ఆయన వివాహమాడతారు. ఈ వేడుకను రూ.5,000 (600 మిలియన్ల డాలర్లు) కోట్ల ఖర్చుతో కొలరాడోలో గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. వీరి పెళ్లికి అతిరథ మహారథులను ఆహ్వానిస్తారని సమాచారం. కాగా బెజోస్ గతంలో మెకంజీ స్కాట్‌ను పెళ్లి చేసుకుని విడాకులు ఇచ్చారు. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు.
News December 22, 2024
మనవడి రికార్డు.. చంద్రబాబు ప్రశంసలు
నారా వారసుడు దేవాన్ష్ <<14952633>>ప్రపంచ రికార్డు<<>> సృష్టించడంతో తాత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు Xలో సంతోషం వ్యక్తం చేశారు. కృషి, పట్టుదల, అంకితభావం విజయానికి కీలకమని, ఈ లక్ష్యాన్ని చేరుకునేందుకు కొన్ని నెలలుగా దేవాన్ష్ పడిన కష్టాన్ని చూసి గర్విస్తున్నట్లు పేర్కొన్నారు. దేవాన్ష్ నిబద్ధత కళ్లారా చూశామని, ఈ ఘనత అందుకోవడం గర్వంగా ఉందని తల్లిదండ్రులు లోకేశ్, బ్రహ్మణి ట్వీట్ చేశారు.
News December 22, 2024
క్రిస్మస్ సెలవులు ఎన్ని రోజులంటే?
తెలుగు రాష్ట్రాల్లో క్రిస్మస్ సెలవులపై కొందరు అయోమయానికి గురవుతున్నారు. తెలంగాణలో ప్రభుత్వ క్యాలెండర్ ప్రకారం ఈ నెల 25, 26న పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయి. ఆ రెండు రోజులు స్కూళ్లు, ప్రభుత్వ ఆఫీసులకు సెలవులు ఉంటాయి. 24న ఆప్షనల్ హాలిడే ఉండటంతో కొన్ని స్కూళ్లు ఆ రోజూ సెలవు ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు ఏపీలో 25న మాత్రమే పబ్లిక్ హాలిడే ఉండగా, 24, 26 తేదీల్లో ఆప్షనల్ హాలిడేస్ ఇచ్చారు.