News December 22, 2024
అమెరికాలో పెగాసస్ ప్రకంపనలు
పెగాసస్ స్పైవేర్ మళ్లీ వెలుగులోకొచ్చింది. ఈ స్పైవేర్‌ను వృద్ధి చేసిన Israel కంపెనీ NSO చట్ట వ్యతిరేక చర్యలను USలోని ఓ కోర్టు మొదటిసారిగా గుర్తించింది. WhatsApp వేసిన కేసులో 1400 మంది యూజర్లపై దీన్ని వాడినట్టు కోర్టు నిర్ధారించింది. 2021లో 300 మందిపై NDA Govt నిఘా పెట్టిందని ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు కమిటీ విచారించింది. విచారణలో కేంద్రం తమకు సహకరించలేదని కమిటీ తెలిపింది.
Similar News
News January 22, 2025
దావోస్‌లో ప్రభుత్వం కీలక ఒప్పందాలు
TG: దావోస్‌లో రాష్ట్ర ప్రభుత్వం పలు కీలక ఒప్పందాలు చేసుకుంది. మేఘా ఇంజినీరింగ్, ప్రభుత్వం మధ్య మూడు ఒప్పందాలు జరిగాయి. 2,160 మెగావాట్ల పంప్ స్టోరేజ్ ప్రాజెక్ట్ కోసం రూ.11వేల కోట్లతో ఒప్పందం జరిగింది. బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ కోసం మరో రూ.3వేల కోట్లు, అనంతగిరిలో ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటు కోసం రూ.1000 కోట్లతో ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకుంది.
News January 22, 2025
ఈరోజు నమాజ్ వేళలు
✒ తేది: జనవరి 22, బుధవారం ✒ ఫజర్: తెల్లవారుజామున 5.34 గంటలకు ✒ సూర్యోదయం: ఉదయం 6.50 గంటలకు ✒ దుహర్: మధ్యాహ్నం 12.28 గంటలకు ✒ అసర్: సాయంత్రం 4.30 గంటలకు ✒ మఘ్రిబ్: సాయంత్రం 6.06 గంటలకు ✒ ఇష: రాత్రి 7.22 గంటలకు NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News January 22, 2025
శుభ ముహూర్తం (22-01-2025)
✒ తిథి: బహుళ అష్టమి మ.1.17 వరకు ✒ నక్షత్రం: స్వాతి రా.1.03 వరకు ✒ శుభ సమయములు: ఏమీ లేవు ✒ రాహుకాలం: ప.12.00-1.30 వరకు ✒ యమగండం: ఉ.7.00-9.00 వరకు ✒ దుర్ముహూర్తం: ఉ.11.36 – 12.24 వరకు ✒ వర్జ్యం: లేదు ✒ అమృత ఘడియలు: మ.3.18-5.05 వరకు