News March 16, 2024

కోర్టులో వాడీవేడి వాదనలు

image

కవిత అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాడీవేడి వాదనలు సాగుతున్నాయి. కవిత తరఫున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి, ఈడీ తరఫున ఎన్.కె.మట్టా, హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. కవితను విచారించేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోరుతుండగా.. ఇది అక్రమ అరెస్ట్ అని, బెయిల్ ఇవ్వాలంటూ కవిత లాయర్ వాదిస్తున్నారు. కవిత మాట్లాడేందుకు న్యాయమూర్తి 5 నిమిషాల సమయం ఇచ్చారు.

Similar News

News September 29, 2024

KBR పార్క్ చుట్టూ ఫ్లైఓవర్లు, అండర్ పాస్‌లు

image

TG: హైదరాబాద్ కేబీఆర్ పార్కు చుట్టూ రూ.826 కోట్లతో 6 జంక్షన్లను ప్రభుత్వం నిర్మించనుంది. రెండు ప్యాకేజీలుగా నిర్మించే ఈ ప్రాజెక్ట్‌లో మొదటిగా 2 ఫ్లైఓవర్లు, 3 అండర్‌పాస్‌లు, సెకండ్ ప్యాకేజీలో 4 ఫ్లైఓవర్లు, 4 అండర్‌పాస్‌లు అభివృద్ధి చేయనుంది. ఈ నిర్మాణాలు పూర్తైతే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ నుంచి హైటెక్ సిటీ, మాదాపూర్, కొండాపూర్, యూసుఫ్‌గూడ ప్రాంతాలకు వెళ్లే వారికి ట్రాఫిక్ సమస్యలు తొలగనున్నాయి.

News September 29, 2024

మంత్రి ఉత్తమ్‌‌కు పితృవియోగం

image

TG: మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డికి పితృవియోగం కలిగింది. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తండ్రి పురుషోత్తంరెడ్డి కన్నుమూశారు. ఇవాళ సాయంత్రం హైదరాబాద్‌లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా మంత్రి ఉత్తమ్ కుటుంబ సభ్యులకు సీఎం రేవంత్ రెడ్డి సంతాపం తెలియజేశారు.

News September 29, 2024

లడ్డూ వివాదంపై రేపు సుప్రీంకోర్టులో విచారణ

image

తిరుమల శ్రీవారి లడ్డూ వ్యవహారంపై దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు రేపు విచారించనుంది. లడ్డూ తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వు కలిపారంటూ జరుగుతున్న ప్రచారంపై ఐదుగురు పిటిషన్లు వేశారు. దీనిపై రిటైర్డ్ సుప్రీంకోర్టు/హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో దర్యాప్తు జరపాలని పిటిషనర్లు కోరారు. వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్య స్వామి సహా పలువురు ఈ పిటిషన్లు వేశారు.