News March 16, 2024

కోర్టులో వాడీవేడి వాదనలు

image

కవిత అరెస్టుపై రౌస్ అవెన్యూ కోర్టులో వాడీవేడి వాదనలు సాగుతున్నాయి. కవిత తరఫున సీనియర్ లాయర్ విక్రమ్ చౌదరి, ఈడీ తరఫున ఎన్.కె.మట్టా, హుస్సేన్ వాదనలు వినిపిస్తున్నారు. కవితను విచారించేందుకు 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ తరఫు న్యాయవాదులు కోరుతుండగా.. ఇది అక్రమ అరెస్ట్ అని, బెయిల్ ఇవ్వాలంటూ కవిత లాయర్ వాదిస్తున్నారు. కవిత మాట్లాడేందుకు న్యాయమూర్తి 5 నిమిషాల సమయం ఇచ్చారు.

Similar News

News October 11, 2024

మహిషాసురమర్దనిగా దుర్గమ్మ దర్శనం

image

AP: రాష్ట్రవ్యాప్తంగా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. విజయవాడ కనకదుర్గమ్మ ఇవాళ మహిషాసురమర్దనిగా భక్తులకు దర్శనమిస్తున్నారు. అష్టభుజాలతో సింహ వాహనంపై కొలువుదీరారు. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సర్వదోషాలు తొలగిపోతాయని, ధైర్య, స్థైర్య, విజయాలు చేకూరుతాయని భక్తుల నమ్మకం.

News October 11, 2024

తండ్రిని పట్టించుకోని కొడుకులకు RDO షాక్

image

TG:వృద్ధాప్యంలో తండ్రికి నీడగా నిలవాల్సిన కొడుకులు కాదనుకున్నారు. సిరిసిల్ల(D) తంగళ్లపల్లిలో తండ్రి రాజమల్లు పేరుతో రావాల్సిన డబుల్ బెడ్ రూమ్‌ను భార్య పేరుతో పెద్ద కొడుకు రాయించుకున్నాడు. 6 నెలలుగా ఇద్దరు కొడుకులూ పట్టించుకోకపోవడంతో భిక్షాటన చేస్తూ కడుపునింపుకుంటున్నాడు. ఇటీవల ఫిర్యాదు చేయడంతో కొడుకు డబుల్ బెడ్ రూమ్ ఇంటిని RDO తండ్రికి కేటాయించారు. ఆయనకు నెలకు ₹2000 ఇవ్వాలని కొడుకులను ఆదేశించారు.

News October 11, 2024

రతన్ టాటాకు భారతరత్న ఇవ్వాలని డిమాండ్

image

దివంగత రతన్ టాటా దేశానికి చేసిన సేవకు గుర్తుగా భారతరత్న ఇవ్వాలనే డిమాండ్ ప్రజల నుంచి పెరుగుతోంది. గొప్ప మానవతావాది అయిన టాటా నిజమైన రత్నమని, ఆయనను అత్యున్నత పురస్కారంతో గౌరవించుకోవడం సముచితమని పేర్కొంటున్నారు. తాజాగా మహారాష్ట్ర క్యాబినెట్ కూడా ఆయనకు భారతరత్న ఇవ్వాలని తీర్మానం చేసింది. కాగా నిన్న కోట్లాది మంది అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు పూర్తయ్యాయి.
* టాటాకు ‘భారతరత్న’ డిమాండ్‌పై మీరేమంటారు?