News March 16, 2024
ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ..!

ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతనే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
Similar News
News August 21, 2025
‘జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు అవసరం’

ఆదిలాబాద్ జిల్లాలో యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని యూనివర్సిటీ సాధన సమితి ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ ఆర్ట్స్ కామర్ డిగ్రీ కళాశాలలో సమావేశం నిర్వహించారు. యూనివర్సిటీ ఏర్పడడం వలన జిల్లా ప్రజలకు కాకుండా ఇతర ప్రాంతాలకి వారికి కూడా ఉన్నత విద్యను అందించడం జరుగుతుందని విద్యార్థులకు వివరించారు. అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందన్నారు.
News August 21, 2025
ADB: అప్పుల బాధతో SUICIDE

అప్పుల బాధ తాళలేక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన నేరడిగొండ మండలంలో చోటుచేసుకుంది. కుమారి గ్రామానికి చెందిన పోతగంటి లస్మన్న బుధవారం తన ఇంట్లోనే ఫ్యాన్‌కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. చేసిన అప్పులను ఎలా తీర్చాలో తెలియక తీవ్ర మనస్తాపానికి గురై ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.
News August 20, 2025
ADB: ముంబయిలో వర్షాలు.. 2 రైళ్లు రద్దు

ముంబాయిలో భారీ వర్షాల కారణంగా గురువారం రెండు రైళ్లను రద్దు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ మేరకు పీఆర్వో రాజేశ్ షిండే ఒక ప్రకటన విడుదల చేసింది. గురువారం నాటి జాల్నా-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు(నంబరు 20705), బల్లార్ష-ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్ నందిగ్రాం ఎక్స్‌ప్రెస్ రైలు(నెంబరు 11002) రద్దు చేశామన్నారు. ఆదిలాబాద్ ప్రయాణికులు గమనించాలని సూచించారు.