News March 16, 2024
ఆదిలాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిపై ఉత్కంఠ..!
ఆదిలాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి ఎంపిక విషయంలో ఎడతెగని ఉత్కంఠ కొనసాగుతుంది. పలువురి పేర్లు వినిపిస్తున్నప్పటికీ పార్టీ ఇంకా ఒక నిర్ణయానికి రాలేదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే ఆదివాసీ నేతనే బరిలోకి దించాలని నిర్ణయించినట్టు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కాగా ఇప్పటి వరకు కాంగ్రెస్ టికెట్ కోసం 22 మంది దరఖాస్తు చేసుకున్నారు. త్వరలో అభ్యర్థిని ప్రకటించనున్నట్లు సమాచారం.
Similar News
News October 11, 2024
మంచిర్యాల: ఒకే గ్రామంలో నలుగురికి టీచర్ ఉద్యోగాలు
మంచిర్యాల జిల్లా తాండూరు మండలం అచ్చలాపూర్ గ్రామంలోని నలుగురు డిఎస్సిలో ఒకే ప్రయత్నంలో టీచర్ ఉద్యోగాలు సాధించారు. ఇందులో ఏకారి ఆంజనేయులు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్సు పుప్పాల మానస, రవళి, మానస ముగ్గురు సెకండరీ గ్రేడ్ టీచర్ ఉద్యోగాలు సాధించారు. వీరి తల్లిదండ్రులు కూలీ పని చేసుకుంటూ చదవించి ఉద్యోగాలు సాధించారు. ఒకే గ్రామం నుంచి నలుగురు టీచర్ ఉద్యోగాలు పోందినందుకు గ్రామస్థులు మిత్రులు అభినందించారు.
News October 11, 2024
ఆసిఫాబాద్: ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ పోటీలకు ఆహ్వానం
అమర పోలీసుల జ్ఞాపకార్థం ఈనెల 21న జరుగు ‘పోలీస్ ప్లాగ్ డే’ సందర్భంగా ఫొటోగ్రఫీ, షార్ట్ ఫిల్మ్ తీయడానికి జిల్లాలో ఫోటోగ్రాఫర్లు ముందుకు రావాలని జిల్లా SP శ్రీనివాసరావు తెలిపారు. SP మాట్లాడుతూ.. షార్ట్ ఫిల్మ్ 3 నిమిషాలు మించకూడదన్నారు. 10×8సైజు ఫోటోలను ఈనెల 24 వరకు స్థానిక పోలీస్ స్టేషన్, DSP కార్యాలయంలో అందించాలన్నారు. జిల్లా స్థాయిలో సెలక్ట్ అయిన 3షార్ట్ ఫిల్మ్‌ను స్టేట్ లెవెల్‌కు పంపిస్తామన్నారు.
News October 11, 2024
ADB: సర్పంచ్ ఎన్నికలు.. గ్రామాల్లో సందడి
ADB, NRML, MNCL, ASFB జిల్లాల్లో సర్పంచ్ ఎన్నికల సందడి మొదలైంది. ఇప్పటికే అధికారులు ఓటర్ జాబితా పనిలో నిమగ్నమవగా పోటీ చేయాలనుకునేవారు ముందస్తుగా ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ఇప్పటికే తాము ఎన్నికల్లో గెలవాలంటే ఎలాంటి మేనిఫెస్టో రెడీ చేయాలనే దానిపై వ్యూహాలు రచిస్తున్నారు. ఇందుకు ప్రత్యేక చర్చలు కూడా జరుపుతున్నట్లు సమాచారం. ఇక మరికొందరు తమ గ్రామంలో ఓటర్ల వివరాలు తెలుసుకునే పనిలో నిమగ్నమయ్యారు.