News December 23, 2024

జనవరిలో దావోస్ పర్యటనకు తెలుగు రాష్ట్రాల సీఎంలు

image

వచ్చే నెల 20 నుంచి దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనమిక్ ఫోరం వార్షిక సదస్సుకు భారత్ నుంచి ముగ్గురు సీఎంలు హాజరుకానున్నారు. ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ ఇందులో పాల్గొంటారు. వీరితో పాటు ఏపీ మంత్రి లోకేశ్, కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివ కుమార్, TN మంత్రి టీఆర్‌బీ రాజా, యూపీ మంత్రి సురేశ్ ఖన్నా తదితరులు ఈ సదస్సుకు హాజరు కానున్నారు.

Similar News

News December 23, 2024

బెనిఫిట్ షోలపై నిషేధాన్ని స్వాగతించిన ఫిల్మ్ ఎగ్జిబిటర్లు

image

TG: బెనిఫిట్ షోలకు అనుమతి ఇవ్వబోమని సీఎం రేవంత్ ప్రకటించడాన్ని తెలంగాణ ఫిల్మ్ ఎగ్జిబిటర్ల అసోసియేషన్ స్వాగతించింది. టికెట్ ధరలు నిర్ణీత మొత్తంలోనే, సామాన్యులకు అందుబాటులో ఉండాలన్నారు. ధరల పెంపుతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు మూతపడుతున్నాయని, ధరలు తక్కువ ఉంటే ప్రేక్షకులు చూడటానికి వస్తారని తెలిపారు.

News December 23, 2024

మోహన్ బాబు ముందస్తు బెయిల్ పిటిషన్ కొట్టివేత

image

TG: మోహన్‌బాబు‌కు హైకోర్టులో షాక్ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టేసింది. జర్నలిస్టుపై దాడి కేసులో ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే ఆయనకు నోటీసులు ఇచ్చిన పోలీసులు మోహన్‌బాబును అదుపులోకి తీసుకునే అవకాశం ఉంది.

News December 23, 2024

ఏడాదిలో ₹16 నుంచి ₹1702కు పెరిగిన షేర్లు.. సస్పెండ్ చేసిన సెబీ

image

భారత్ గ్లోబల్ డెవలపర్స్ (BGDL)పై సెబీ కఠిన చర్యలు తీసుకుంది. అవినీతి, అవకతవకలకు పాల్పడుతోందన్న ఫిర్యాదులు రావడంతో షేర్ల ట్రేడింగును నిలిపివేసింది. 2020, జులై వరకు ఐదుగురు ప్రమోటర్లకు 16.77% (93,860 షేర్లు) వాటా ఉండగా ప్రస్తుతం 100% పబ్లిక్ వద్దే ఉన్నట్టు సెబీ గమనించింది. ఆస్తులు, అప్పులు, ఖర్చులు పెంచి చూపినట్టు కనుగొంది. 2024 ఆరంభంలో రూ.16గా ఉన్న ఈ షేర్లు 105 రెట్లు పెరిగి రూ.1702కు చేరాయి.