News March 16, 2024
బీఆర్ఎస్కు మంత్రి కోమటిరెడ్డి పంచ్
TG: ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ‘గతంలో ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే HYDలో నిరసనలు ఎందుకన్నారు. మరి ఇప్పుడు కవితను ED అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? వెళ్లి ఢిల్లీలోని ED కార్యాలయం ముందు చేసుకోండి. అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Similar News
News November 21, 2024
ఈ సముద్రాలు కాంతులీనుతాయి!
రాత్రి వేళ సముద్రతీరాన ఉండే అనుభూతే వేరుగా ఉంటుంది. మరి సముద్రం నీలికాంతులతో ధగధగలాడుతుంటే ఇంకెంత అందంగా ఉంటుంది? భూమిపైకి స్వర్గమే వచ్చినట్లు కనిపిస్తుంది. ఆ కాంతుల్ని బయోలుమినిసెన్స్ అంటారు. భారత్‌లో అలాంటి సముద్ర తీరాల్లో కొన్ని.. కేరళలోని మునాంబం బీచ్, అండమాన్ నికోబార్ దీవుల సముదాయంలో ఒకటైన హావ్లాక్ దీవి, పశ్చిమ బెంగాల్‌లోని తాజ్పూర్ బీచ్, గోవాలోని కేరీ బీచ్, లక్షద్వీప్‌లోని బంగారం దీవి.
News November 21, 2024
13 నెలల యుద్ధం.. 44,056 మరణాలు: పాలస్తీనా
హమాస్-ఇజ్రాయెల్ మధ్య 13 నెలలుగా జరుగుతున్న యుద్ధం కారణంగా గాజాలో 44,056 మంది మరణించినట్లు పాలస్తీనా అధికారులు ప్రకటించారు. వీరిలో సగానికి పైగా మహిళలు, చిన్నారులే ఉన్నారని తెలిపారు. శిథిలాల కిందే వేలాది మృతదేహాలు సమాధి అయ్యాయని, తాము ప్రకటించిన దానికంటే మరణాలు ఎక్కువే ఉండొచ్చని వెల్లడించారు. అలాగే 1,04,268 మంది గాయపడ్డారన్నారు. మరోవైపు 17,000 మంది మిలిటెంట్లను హతమార్చినట్లు ఇజ్రాయెల్ చెబుతోంది.
News November 21, 2024
అసలు ఏంటీ ‘అదానీ స్కాం’!
ప్రభుత్వరంగ సంస్థ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (SECI)కు <<14669944>>అదానీ<<>> గ్రూప్ 12 GW సోలార్ విద్యుత్‌ను సప్లై చేయాలి. SECI రాష్ట్రాల్లోని డిస్కంలతో ఆ పవర్‌ను కొనుగోలు చేయించాలి. ఇది ఒప్పందం. కానీ SECI విఫలం కావడంతో అదానీ ఆయా రాష్ట్రప్రభుత్వాల ప్రతినిధులు, డిస్కంలకు రూ.2వేల కోట్ల లంచం ఇచ్చి SECI నుంచి పవర్ కొనుగోలు చేయించారని అభియోగం. ఇందులో APకే రూ.1750 కోట్లు అందించారని US కోర్టులో కేసు నమోదైంది.