News March 16, 2024
బీఆర్ఎస్‌కు మంత్రి కోమటిరెడ్డి పంచ్
TG: ఢిల్లీ లిక్కర్ కేసుకు, తెలంగాణ ప్రజలకు ఏం సంబంధమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ప్రశ్నించారు. ‘గతంలో ఏపీలో చంద్రబాబును అరెస్టు చేస్తే HYDలో నిరసనలు ఎందుకన్నారు. మరి ఇప్పుడు కవితను ED అరెస్టు చేస్తే రాష్ట్రంలో ఆందోళనలు ఎందుకు చేస్తున్నారు? వెళ్లి ఢిల్లీలోని ED కార్యాలయం ముందు చేసుకోండి. అమాయక కార్యకర్తలను రోడ్లపైకి తెస్తున్నారు. రాష్ట్ర ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారు’ అని మండిపడ్డారు.
Similar News
News October 13, 2024
RTC ప్రయాణికులకు షాక్.. బస్సులు తక్కువ, ఛార్జీల పెంపు!
TG: దసరా పండుగకు స్వగ్రామాలకు వెళ్లి హైదరాబాద్ తిరిగి వచ్చే వారికి చుక్కలు కనబడుతున్నాయి. వరంగల్ తదితర నగరాల నుంచి తగినన్ని బస్సులు లేకపోవడంతో బస్టాండ్ల వద్ద గంటల తరబడి ఎదురుచూస్తున్నారు. ఇక ఛార్జీలను మరోసారి పెంచారని ప్రయాణికులు వాపోతున్నారు. ఉప్పల్ నుంచి తొర్రూరు స్పెషల్ ఎక్స్‌ప్రెస్ బస్సుకు OCT 9న రూ.270 వసూలు చేయగా, ఇవాళ తొర్రూర్ నుంచి ఉప్పల్ వరకు రూ.320 వసూలు చేస్తున్నారని మండిపడుతున్నారు.
News October 13, 2024
పూరీ ఆలయంలో భక్తులకు ఉచితంగా ప్రసాదం!
పూరీ జగన్నాథుడి ఆలయంలో భక్తులకు ఉచితంగా మహాప్రసాదాన్ని పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. దీనిపై త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని మంత్రి పృథ్వీరాజ్ తెలిపారు. దీని వల్ల ఏటా ₹14-15 కోట్ల భారం పడుతుందన్నారు. అయితే, ఉచితంగా ప్రసాదం పంపిణీకి విరాళాలు ఇవ్వడానికి కొంత మంది భక్తులు ముందుకొచ్చినట్టు వెల్లడించారు. కార్తీక మాసం తరువాత అమలు చేసే అవకాశం ఉన్నట్టు మంత్రి తెలిపారు.
News October 13, 2024
రేపు మద్యం దుకాణాలకు లాటరీ
AP: రాష్ట్రవ్యాప్తంగా మద్యం దుకాణాలకు 89,882 దరఖాస్తులు అందాయి. రూ.2లక్షల నాన్ రిఫండబుల్ ఫీజుతో ఖజానాకు రూ.1,797 కోట్ల ఆదాయం లభించింది. అనంతపురం జిల్లాలో 12 దుకాణాలకు అతి తక్కువ దరఖాస్తులు రావడంతో దరఖాస్తులను మళ్లీ పరిశీలించాలని ఎక్సైజ్ శాఖ భావిస్తోంది. రేపు లాటరీ పద్ధతిలో షాపులు కేటాయిస్తారు. ఎల్లుండి ప్రైవేట్ వ్యక్తులకు దుకాణాలు అప్పగిస్తారు. 16 నుంచి కొత్త మద్యం విధానం అమల్లోకి వస్తుంది.