News December 23, 2024
ఘనంగా పీవీ సింధు వివాహం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. వివాహ ఫొటోలను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుదల చేయలేదు. రేపు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.
Similar News
News December 23, 2024
PV సింధు పెళ్లి(PHOTO)
ప్రముఖ బ్యాడ్మింటన్ ప్లేయర్, తెలుగు తేజం పీవీ సింధు వివాహం రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఘనంగా జరిగింది. తన చిరకాల మిత్రుడు వెంకట దత్తసాయి మూడుముళ్లు వేశారు. సన్నిహితులు, కుటుంబసభ్యులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నూతన జంట ఫొటోలు వైరలవుతున్నాయి. కాగా రేపు హైదరాబాద్‌లో గ్రాండ్‌గా రిసెప్షన్ జరగనుంది.
News December 23, 2024
నేను చెబితే చంద్రబాబు చెప్పినట్లే: ఆదోని MLA
AP: ఆదోని నియోజకవర్గంలో గత పదేళ్లు సర్వం తామే అని వ్యవహరించిన వైసీపీ కార్యకర్తలకు 5 నెలల సమయం ఇచ్చామని, ఇక చాలని MLA పార్థసారథి అన్నారు. ఆదోనిలో లబ్ధి చేకూరే ఏ ఒక్క పనిలోనూ వైసీపీ కార్యకర్త ఉండటానికి వీల్లేదన్నారు. తాను చెబితే చంద్రబాబు, పవన్ చెప్పినట్లేనని, మర్యాదగా వదిలిపోండని హెచ్చరించారు. తమను ఆపే శక్తి ఈ రాష్ట్రంలో రాబోయే 25 ఏళ్ల వరకు ఎవరికీ లేదని ఆయన చెప్పారు.
News December 23, 2024
సంభల్: ఆ మెట్లబావి, సొరంగానికి ‘సిపాయిల తిరుగుబాటు’తో అనుబంధం
UP సంభల్ ఆక్రమణల తొలగింపుతో మన గత చరిత్ర వెలుగుచూస్తోంది. తాజాగా బయటపడ్డ సొరంగం, మెట్లబావి 150 ఏళ్ల క్రితానివని భావిస్తున్నారు. 1857లో బ్రిటిషర్లపై సిపాయిల తిరుగుబాటును ప్రప్రథమ స్వాతంత్ర్య సమరంగా చెప్తారు. అప్పటి సిపాయిలకిది ఎస్కేప్ రూట్‌గా ఉపయోగపడిందని సమాచారం. ఆదివారం ASI టీమ్ సంభల్‌లో 5 పవిత్ర స్థలాలు, 19 బావులను సర్వే చేసింది. తవ్వేకొద్దీ ఇక్కడ మరింత చరిత్ర బయటపడొచ్చని అధికారులు అంటున్నారు.