News December 23, 2024
ఘనంగా పీవీ సింధు వివాహం
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు వివాహం ఉదయ్‌పూర్‌లో ఆదివారం రాత్రి 11.20 గంటలకు ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకట దత్తసాయితో ఏడడుగులు నడిచారు. ఈ వేడుకకు దాదాపు 140 మంది అతిథులు మాత్రమే హాజరైనట్లు సమాచారం. వివాహ ఫొటోలను ఇరు ఫ్యామిలీలు ఇంకా విడుదల చేయలేదు. రేపు హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ జరగనుంది. సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నారు.
Similar News
News January 13, 2025
పల్లెలు కళకళలాడుతుంటే సంతోషంగా ఉంది: పవన్ కళ్యాణ్
AP: రంగవల్లులు, గొబ్బెమ్మలు, గంగిరెద్దులు, హరిదాసులు, భోగిమంటలు, పిండివంటల సమ్మేళనమే సంక్రాంతి అని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. అలాంటి సరదాల కోసం నగరాలన్నీ పల్లెల వైపు పరుగులు తీశాయని చెప్పారు. భారతీయులందరికీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. సంక్రాంతి వేళ పల్లెలు పిల్లా పాపలతో కళకళలాడుతుంటే సంతోషంగా ఉందని తెలిపారు. ఆనందాలు, సిరి సంపదలతో పల్లెలు సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు.
News January 13, 2025
సంక్రాంతి కానుక.. ఇవాళే అకౌంట్లలోకి డబ్బులు
AP: ఉద్యోగులకు పెండింగ్‌లో ఉన్న దాదాపు రూ.2వేల కోట్ల బకాయిలను ప్రభుత్వం ఇవాళ విడుదల చేయనున్నట్లు AP NGO అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి విద్యాసాగర్ వెల్లడించారు. పోలీసుల సరెండర్ లీవ్, ఉద్యోగుల GPF, మెడికల్ రీయింబర్స్‌మెంట్, FTA బిల్లులు సాయంత్రంలోపు అకౌంట్లలోకి జమ కానున్నాయని తెలిపారు. సర్వీస్ పోస్టేజ్, ఇంటర్నెట్ ఛార్జీలు, అడ్మినిస్ట్రేటివ్ ఖర్చులు, మైనర్ రిపేర్స్ బిల్లులూ త్వరలో విడుదలవుతాయన్నారు.
News January 13, 2025
రేపు జైలర్-2 అనౌన్స్‌మెంట్ టీజర్!
రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ మూవీ జైలర్ సీక్వెల్‌కు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. సంక్రాంతి సందర్భంగా రేపు సా.6 గంటలకు కొత్త సినిమా అనౌన్స్‌మెంట్ టీజర్‌ను తెలుగు, తమిళం, హిందీ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు ‘సన్ పిక్చర్స్’ ప్రకటించింది. ‘SUPER SAGA’ పేరుతో ఓ పోస్టర్‌ను సోషల్ మీడియాలో షేర్ చేసింది. అయితే ఆ అనౌన్స్‌మెంట్ జైలర్-2 గురించే అని సూపర్‌స్టార్ ఫ్యాన్స్ కామెంట్ చేస్తున్నారు.