News December 23, 2024

ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు: మంత్రి

image

TG: సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన <<14952214>>దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు.

Similar News

News December 30, 2025

ఇతిహాసాలు క్విజ్ – 112

image

ఈరోజు ప్రశ్న: జరాసంధుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>

News December 30, 2025

పవర్‌గ్రిడ్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

image

<>పవర్‌గ్రిడ్ <<>>కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో 48 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీస్ ఆఫ్ ఇండియా(ICSI)లో అసోసియేట్ మెంబర్ అయి, ఏడాది పాటు పని అనుభవం గల వారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 29ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. www.powergrid.in

News December 30, 2025

బంగ్లాలో ఇండియన్స్‌ వర్క్ పర్మిట్ల రద్దుకు అల్టిమేటం

image

ఇంక్విలాబ్ మంచ్ నేత ఉస్మాన్ హాదీ హత్య తర్వాత బంగ్లాలో భారత వ్యతిరేక సెంటిమెంట్ పెరిగింది. తాజాగా ఇంక్విలాబ్ సంస్థ యూనస్ ప్రభుత్వానికి అల్టిమేటం జారీ చేసింది. భారతీయులకు 24 గంటల్లోగా వర్క్ పర్మిట్లు రద్దు చేయాలని డిమాండ్ చేసింది. అలాగే 24 రోజుల్లోగా హాదీ హత్యకు కారణమైన ప్రతిఒక్కరినీ చట్టం ముందు నిలబెట్టాలని కోరింది. నిందితులు భారత్‌కు పారిపోయారని ఆరోపించిన కొన్ని గంటల్లోనే ఈ అల్టిమేటం వచ్చింది.