News December 23, 2024
ప్రజాస్వామ్యంలో భౌతిక దాడులకు తావు లేదు: మంత్రి
TG: సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన <<14952214>>దాడిని<<>> తీవ్రంగా ఖండిస్తున్నానని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా ఎవరూ వ్యవహరించకూడదని కోరారు. సంధ్య థియేటర్ ఘటనకు సంబంధించిన అంశం కోర్టులో ఉందని, చట్టం తన పని తాను చేసుకుపోతుందని ట్వీట్ చేశారు.
Similar News
News January 14, 2025
కరీంనగర్‌కు కౌశిక్ రెడ్డి తరలింపు
TG: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనను కరీంనగర్‌కు తరలించారు. ఈ క్రమంలో వన్ టౌన్ పోలీస్ స్టేషన్‌కు తీసుకువస్తారనే సమాచారంతో బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున అక్కడికి చేరుకుని ఆందోళనకు దిగారు. వారిని పోలీసులు అడ్డుకున్నారు. మరికాసేపట్లో ఆయనను జడ్జి ముందే ప్రవేశపెట్టే అవకాశముంది. మరోవైపు కౌశిక్‌ను అరెస్ట్ చేయడం అక్రమమని హరీశ్ రావు అన్నారు.
News January 14, 2025
నా ఇన్వెస్ట్‌మెంట్స్‌ను భర్త చూసుకుంటున్నారు: పీవీ సింధు
మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ ఆస్పత్రిలో ఉన్న వీడియో చూసినప్పుడు ఎమోషనల్ అయినట్లు పీవీ సింధు చెప్పారు. ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి ప్రతి రూపాయిని జాగ్రత్తగా ఇన్వెస్ట్ చేయాలన్నారు. ‘నా ఆదాయం, పన్నుల వ్యవహారాన్ని పేరెంట్స్ చూసుకుంటున్నారు. ఇన్వెస్ట్‌మెంట్స్‌ను భర్త దత్తసాయి మేనేజ్ చేస్తున్నారు. ఇప్పటివరకు నాకు ఎలాంటి ఆర్థిక సమస్యలు రాలేదు. అందుకు నేను సంతోషిస్తున్నా’ అని పేర్కొన్నారు.
News January 14, 2025
రేపు సాయంత్రం 6 గంటలకు..
సంక్రాంతి సందర్భంగా కేరళ శబరిమలలో మకరజ్యోతిని ప్రత్యక్షంగా వీక్షించేందుకు లక్షలాది మంది భక్తులు అక్కడికి చేరుకున్నారు. రేపు సాయంత్రం 6-7 గంటల మధ్య జ్యోతి దర్శనం ఇస్తుంది. ఎన్నో దశాబ్దాలుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఆకాశంలో నక్షత్రంలా కనిపించే ఈ కాంతిని దర్శించుకుంటే జీవితంలో సుఖ, సంతోషాలు కలుగుతాయని ప్రజల నమ్మకం. అక్కడికి వెళ్లలేకపోయినా టీవీలో వీక్షించేందుకు కోట్లాది మంది ఎదురుచూస్తున్నారు.