News December 23, 2024

ఏపీలో వచ్చే నెల 8న ప్రధాని మోదీ పర్యటన

image

AP: ప్రధాని మోదీ వచ్చే నెల 8న అనకాపల్లిలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అదే రోజు బహిరంగ సభలో ప్రధాని ప్రసంగించనున్నట్లు బీజేపీ వర్గాలు తెలిపాయి.

Similar News

News January 13, 2025

గాలిపటాలు ఎగురవేస్తున్నారా?

image

సంక్రాంతి అంటేనే గాలిపటాలు ఎగురవేయడం తప్పనిసరి. ముఖ్యంగా పిల్లలు గాలిపటాలు ఎగురవేయాలని ఉత్సాహపడుతుంటారు. వీటిని ఎగురవేసే సమయంలో మాంజాను కాకుండా సాధారణ దారాలను ఉపయోగించాలి. రోడ్ల పక్కన, రైల్వే ట్రాకులు, విద్యుత్ పోల్స్ సమీపంలో ఎగరవేయడం ప్రమాదకరం. భవనాలపై ఎగురవేసినప్పుడు, చిన్నపిల్లలు పక్కన ఉంటే జాగ్రత్తగా ఉండాలి. కాళ్లకు గాయాలు కాకుండా షూలు, చెప్పులు ధరించడం తప్పనిసరి.

News January 13, 2025

ఈ పోస్టర్ అదిరిపోయిందిగా..

image

సినీ అభిమానులకు సంక్రాంతి ఎప్పుడూ ప్రత్యేకమే. పైగా తమ ఫేవరేట్ హీరోల చిత్రాలు విడుదలైతే వారు చేసే సందడి మామూలుగా ఉండదు. అలాగే TFI బాగుండాలని కొందరు కోరుకుంటారు. ఈ క్రమంలో APలోని యడ్లపాడులో ఏర్పాటు చేసిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. బాలయ్య, చెర్రీ, వెంకీమామ సినిమా పేర్లతో ‘మేం మేం బానే ఉంటాం.. మీరే ఇంకా బాగుండాలి’ అని సంక్రాంతి విషెస్ తెలిపారు. దీనిని సోషల్ మీడియాలో షేర్ చేయగా తెగ వైరలవుతోంది.

News January 13, 2025

నేటి నుంచి కైట్ ఫెస్టివల్

image

TG: నేటి నుంచి మూడు రోజుల పాటు హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో కైట్ ఫెస్టివల్ జరగనుంది. ఈ వేడుకలకు 16 దేశాల నుంచి 47 మంది కైట్ ప్లేయర్లు, 14 రాష్ట్రాల నుంచి కైట్ క్లబ్ సభ్యులు హాజరుకానున్నారు. దీంతో పాటు స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నారు. జాతీయ‌, అంతర్జాతీయ స్వీట్లను, తెలంగాణ పిండి వంట‌ల‌ు ఇక్కడి స్టాళ్ల‌లో ప్రదర్శిస్తారు. ఈ వేడుకలకు సంబంధించి మంత్రి జూపల్లి కృష్ణారావు పోస్టర్‌ను రిలీజ్ చేశారు.