News December 23, 2024
రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన
AP: మాజీ CM జగన్ రేపటి నుంచి 4 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 24న బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకొని YSR ఘాట్ వద్ద నివాళులర్పించి పులివెందుల చేరుకుంటారు. 25న CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 26న పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27న ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న ఓ వివాహానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News December 23, 2024
ఖేల్‌రత్నకు మను అర్హురాలు కాదా?
మనూ భాకర్.. భారత చరిత్రలో ఒకే ఒలింపిక్స్‌లో 2 మెడల్స్ సాధించిన స్టార్ షూటర్. ప్రపంచ వేదికపై తన ప్రదర్శనతో భారతీయుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచారు. దేశానికి కీర్తిప్రతిష్ఠలు తెచ్చిన ఆమె పేరును ఖేల్‌రత్నకు నామినేట్ చేయలేదనే వార్తలు క్రీడాభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. క్రీడల్లో అత్యున్నత ప్రదర్శనకుగానూ ప్రదానం చేసే ఈ అవార్డుకు ఆమె అర్హురాలు కాదా? అని ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?
News December 23, 2024
కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన దర్శకుడు
దర్శక దిగ్గజం <<14962066>>శ్యామ్ బెనగల్<<>> మరణంతో సినీలోకం విషాదంలో మునిగిపోయింది. ఆయన HYD తిరుమలగిరిలో జన్మించారు. విద్యాభ్యాసం మెహబూబ్, నిజాం కాలేజీలో చేశారు. ప్రొఫెషనల్ వర్క్ కోసం బాంబేకు షిఫ్ట్ అయ్యారు. సత్యజిత్ రే తర్వాత మిడిల్ క్లాస్ సినిమాల దర్శకుడిగా కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టారు. ANR జాతీయ అవార్డుతో పాటు అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు. 2006-12 మధ్య కాలంలో రాజ్యసభ ఎంపీగా చేశారు.
News December 23, 2024
BIG BREAKING: అల్లు అర్జున్‌కు పోలీసుల నోటీసులు
హీరో అల్లు అర్జున్‌కు చిక్కడపల్లి పోలీసులు మరోసారి నోటీసులు ఇచ్చారు. రేపు ఉదయం 11 గంటలకు విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఇప్పటికే ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. తర్వాత బన్నీని అరెస్ట్ చేయగా హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ ఇచ్చింది.