News December 23, 2024
రేపటి నుంచి కడప జిల్లాలో జగన్ పర్యటన
AP: మాజీ CM జగన్ రేపటి నుంచి 4 రోజుల పాటు కడప జిల్లాలో పర్యటించనున్నారు. 24న బెంగళూరు నుంచి ఇడుపులపాయ చేరుకొని YSR ఘాట్ వద్ద నివాళులర్పించి పులివెందుల చేరుకుంటారు. 25న CSI చర్చిలో జరిగే క్రిస్మస్ వేడుకల్లో పాల్గొంటారు. 26న పులివెందుల క్యాంప్ ఆఫీస్‌లో ప్రజాదర్బార్ నిర్వహిస్తారు. 27న ఉదయం 9 గంటలకు పులివెందుల విజయా గార్డెన్స్‌లో జరగనున్న ఓ వివాహానికి హాజరవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి.
Similar News
News January 14, 2025
భారీగా పతనమైన HCL స్టాక్స్
Q3 ఫలితాలు మెరుగ్గా ఉన్నప్పటికీ దేశంలో మూడో అతిపెద్ద IT దిగ్గజం HCL Technologies షేర్లు మంగళవారం భారీగా నష్టపోయాయి. గత సెషన్‌లో స్థిరపడిన ₹1,975 నుంచి ₹1,819 వరకు 8.52% మేర పతనమయ్యాయి. Q3లో ₹4,591 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసిన సంస్థ గత క్వార్టర్ కంటే 8.5% వృద్ధిని నమోదు చేసింది. ఫలితాలు ఆశించిన మేర లేకపోవడం, కంపెనీ ఫ్యూచర్ ప్లాన్స్ కూడా ఇన్వెస్టర్లను మెప్పించలేకపోయాయి.
News January 14, 2025
ఇంగ్లండ్ సిరీసుకు టీమ్ సైజ్ తగ్గించండి: గవాస్కర్
ఇంగ్లండ్ టెస్టు సిరీసుకు టీమ్ సైజును తగ్గించాలని టీమ్ఇండియా లెజెండ్ సునీల్ గవాస్కర్ సలహా ఇచ్చారు. 16 కన్నా ఎక్కువ మందిని ఎంపిక చేయడం సెలక్టర్ల అపనమ్మకాన్ని సూచిస్తోందన్నారు. ఆసీస్‌కు 19 మందిని పంపించడం తెలిసిందే. ఎక్కువ మందిని పంపే స్తోమత BCCIకి ఉన్నా టీమ్ఇండియా క్యాప్ ఈజీగా ఇచ్చేయొచ్చని కాదన్నారు. విదేశాల్లో ప్రాక్టీస్ మ్యాచులు ఎక్కువ ఆడాలని, ఆప్షనల్ ట్రైనింగ్ సెషన్స్ తీసేయాలని చెప్పారు.
News January 14, 2025
ఈ ఏడాదీ బాదుడే.. పెరగనున్న రీఛార్జ్ ధరలు?
గత ఏడాది 25 శాతం వరకు టారిఫ్‌లను పెంచిన టెలికం కంపెనీలు కొత్త సంవత్సరంలోనూ బాదుడుకు సిద్ధమైనట్లు సమాచారం. దాదాపు 10 శాతం ధరలను పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ముఖ్యంగా 5G సేవలకు నిర్దిష్ట ధరలను ప్రవేశపెట్టవచ్చని పేర్కొంటున్నాయి. ధరల పెంపుతో జియో, ఎయిర్‌టెల్, VIల యావరేజ్ రెవెన్యూ కనీసం 25 శాతం పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.