News March 16, 2024

YCP అభ్యర్థులను ప్రకటించనున్న ధర్మాన, నందిగం సురేశ్

image

కాసేపట్లో YCP ఎమ్మెల్యే, MP అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇడుపులపాయలో సీఎం జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేశ్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ వీళ్లిద్దరే అభ్యర్థులను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. దీన్ని, సెంటిమెంట్‌గా భావిస్తున్న వైసీపీ మరోసారి వీరితోనే అభ్యర్థులను ప్రకటించనుంది.

Similar News

News September 29, 2024

శ్రీకాకుళం: భారీగా పెరిగిన నిత్యావసరాల ధరలు

image

దసరా పండగ ముంగిట నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటి సామాన్యులకు చుక్కలు చూపుతున్నాయి. నూనె లీటర్‌ పై రూ.20-45 వరకు, వెల్లుల్లి కిలో రూ.300 నుంచి రూ.360, అల్లం రూ.100 నుంచి రూ.150, ఎండుమిర్చి రూ.200 నుంచి రూ.240, పెసరపప్పు రూ.150, మినపప్పు రూ.135, కందిపప్పు రూ.150 నుంచి 175కు పెరిగాయి. ఉల్లి కేజీ రూ.60కి తగ్గడం లేదు. ధరలు భారీగా పెరగడంతో ఏదీ కొనలేక పోతున్నామని ప్రజలు అంటున్నారు.

News September 29, 2024

శ్రీకాకుళం జిల్లాలో భారీగా సీఐలు బదిలీ

image

విశాఖ రేంజ్‌లో 14 మంది సీఐలుకు శనివారం రాత్రి బదిలీలు జరిగాయి. ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాకు ఐదుగురు సీఐలు రానున్నారు. పాతపట్నం సీఐ నల్లి సాయిని విశాఖ వీఆర్‌కు బదిలీ చేస్తూ డీఐజీ గోపీనాథ్ జట్టి ఉత్తర్వులు జారీ చేశారు. విశాఖ రేంజ్ లో ఉన్న సీఐలు..శ్రీనివాసరావు(డీసీఆర్బీ), కృష్ణారావు (టాస్క్ ఫోర్స్), సూర్యచంద్రమౌళి (సీసీఎస్), ఎం.కృష్ణమూర్తి (డీటీసీ), వానపల్లి రామారావు (పాతపట్నం) స్థానాలకు వస్తున్నారు.

News September 29, 2024

దూసి: గాంధీ పర్యటించిన రైల్వే స్టేషన్‌లో స్థూపం ఏర్పాటు

image

దూసి రైల్వే స్టేషన్‌లో మహాత్మ గాంధీ స్మారక స్థలి ఏర్పాటు చేసేందుకు విశాఖ ఇంటాక్ట్ సంస్థ ప్రతినిధులు సిద్థంగా ఉన్నారని తెలిపారు. ఆ విషయమై పరిశీలించడానికి వచ్చామని సీనియర్ డీసీఎం ఈస్ట్ కోస్ట్ వాల్తేరు డివిజన్ అధికారి పవన్ కుమార్ అన్నారు. శనివారం ఉదయం దూసి రైల్వే స్టేషన్‌ను పలువురు అధికారులతో కలిసి సందర్శించి మహాత్మ గాంధీ పర్యటించిన ప్రదేశాన్ని పరిశీలించారు. దూసి రైల్వే స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.