News March 16, 2024
YCP అభ్యర్థులను ప్రకటించనున్న ధర్మాన, నందిగం సురేశ్
కాసేపట్లో YCP ఎమ్మెల్యే, MP అభ్యర్థుల జాబితా విడుదల కానుంది. ఇడుపులపాయలో సీఎం జగన్ సమక్షంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎంపీ నందిగం సురేశ్ అభ్యర్థులను ప్రకటించనున్నారు. 2019 ఎన్నికల సమయంలోనూ వీళ్లిద్దరే అభ్యర్థులను ప్రకటించారు. ఆ ఎన్నికల్లో వైసీపీ 151 స్థానాల్లో విజయఢంకా మోగించిన విషయం తెలిసిందే. దీన్ని, సెంటిమెంట్‌గా భావిస్తున్న వైసీపీ మరోసారి వీరితోనే అభ్యర్థులను ప్రకటించనుంది.
Similar News
News October 16, 2024
25న శ్రీకాకుళంలో జాబ్ మేళా
శ్రీకాకుళంలోని గవర్నమెంట్ DLTC కాలేజీలో ఈనెల 25న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు స్కిల్ హబ్ కోఆర్డినేటర్ N.శేషగిరి తెలిపారు. పలు కంపెనీలు పాల్గొంటాయన్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, డిప్లొమా, ITI, పూర్తి చేసి 18-24 ఏళ్లు కలిగిన అభ్యర్థులు అర్హులని చెప్పారు. ఈ అవకాశాన్ని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News October 16, 2024
LLB పరీక్ష టైం టేబుల్ విడుదల
శ్రీకాకుళం జిల్లా డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ యూనివర్సిటీ LLB 3 సంవత్సరానికి సంబంధించి 2, 4 సెమిస్టర్ల పరీక్ష టైం టేబుల్ విడుదలైంది. వర్సిటీ ఎగ్జామినేషన్ డీన్ డాక్టర్ ఎస్.ఉదయ్ భాస్కర్ మాట్లాడుతూ.. 2వ సెమిస్టర్ పరీక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు, 4వ సెమిస్టర్ పరీక్షలు మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయన్నారు. పరీక్షలు ఈనెల 22 నుంచి 30వ తేదీ వరకు ఉంటాయన్నారు.
News October 16, 2024
సంతబొమ్మాళి ఘటనలో తల్లి మృతి
సంతబొమ్మాలి మండలం కుమందానివానిపేట గ్రామంలో ఇద్దరు చిన్నారులకు తల్లి విషమిచ్చి చంపిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో తల్లి దుర్గ సైతం చికిత్స పొందుతూ బుధవారం వేకువజామున 3 గంటలకు మృతిచెందినట్లు టెక్కలి జిల్లా ఆసుపత్రి సిబ్బంది వెల్లడించారు. చిన్నారుల మృతి అనంతరం ఆమె ఆత్మహత్యకు ప్రయత్నించింది. టెక్కలి జిల్లా ఆసుపత్రిలో చేర్చగా చనిపోయింది.