News December 24, 2024
పెన్షన్లపై సీఎం కీలక ఆదేశాలు
APలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులు ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు. అర్హులకే పథకాలు, పెన్షన్లు ఇవ్వాలనేది తమ ఉద్దేశమని, ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదన్నారు. అనర్హులను తొలగించేందుకు 3 నెలల్లోగా దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. అటు అర్హులైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Similar News
News December 24, 2024
పెండింగ్ ఛలాన్లపై డిస్కౌంట్.. పోలీసులు ఏమన్నారంటే?
వాహనదారులకు తెలంగాణ పోలీసులు గుడ్ న్యూస్ చెప్పారని, వాహనాలపై ఉన్న పెండింగ్ ఛలాన్లు చెల్లించేందుకు డిస్కౌంట్ ఇచ్చారనే మెసేజ్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. ఈనెల 26వ తేదీ నుంచి వచ్చే నెల 10వరకు బైక్ ఫైన్లపై 80%, కార్లపై 60% డిస్కౌంట్‌తో చెల్లించాలని మెసేజ్‌లో ఉంది. వాహనదారులు దీనిని నమ్ముతుండటంతో పోలీసులు స్పందించారు. ఈ ప్రకటన ఫేక్ అని, దీనిని నమ్మొద్దని సూచించారు.
News December 24, 2024
సీఐడీ మాజీ చీఫ్ సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు
AP: సీఐడీ మాజీ చీఫ్ ఎన్.సంజయ్‌పై ఏసీబీ కేసు నమోదు చేసింది. వైసీపీ హయాంలో ఆయన నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ రిపోర్ట్ ఇవ్వడంతో ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఏ-1గా సంజయ్, ఏ-2గా సౌత్రికా టెక్నాలజీస్, ఏ-3గా క్రిత్వ్యాప్ టెక్నాలజీస్‌ను చేర్చింది. కాగా గతంలో సీఎం చంద్రబాబును అరెస్ట్ చేసి జైలుకు పంపడంతో సంజయ్ కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే.
News December 24, 2024
OYO బుకింగ్స్‌లో హైదరాబాద్ టాప్
ప్రముఖ హోటల్ బుకింగ్ యాప్ ‘OYO’ ఈ ఏడాది ‘ట్రావెలోపీడియా-2024’ పేరిట నివేదిక విడుదల చేసింది. ఇందులో హైదరాబాద్ అత్యధికంగా బుకింగ్స్ చేసిన నగరంగా నిలిచింది. దీని తర్వాత బెంగళూరు, ఢిల్లీ, కోల్‌కతా నగరాలు ఉన్నాయి. ఇక పూరీ, వారణాసి, హరిద్వార్ నగరాలు ఎక్కువగా ప్రయాణించే ఆధ్యాత్మిక గమ్యస్థానాలుగా నిలిచాయి. కాగా తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటకలో అధిక మొత్తంలో బుకింగ్స్ అయ్యాయి.