News December 24, 2024
పెన్షన్లపై సీఎం కీలక ఆదేశాలు
APలో పెన్షన్లు తీసుకునే వారిలో పలువురు అనర్హులు ఉన్నారని CM చంద్రబాబు తెలిపారు. అర్హులకే పథకాలు, పెన్షన్లు ఇవ్వాలనేది తమ ఉద్దేశమని, ఇదే సమయంలో అనర్హులకు పెన్షన్లు ఇవ్వడం సరికాదన్నారు. అనర్హులను తొలగించేందుకు 3 నెలల్లోగా దివ్యాంగుల పెన్షన్లపై తనిఖీలు పూర్తి చేయాలన్నారు. తప్పుడు సర్టిఫికెట్లు ఇచ్చే డాక్టర్లు, అధికారులపై చర్యలు తప్పవన్నారు. అటు అర్హులైన ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.
Similar News
News January 14, 2025
Stock Markets: నేడు పుల్‌బ్యాక్ ర్యాలీకి ఛాన్స్!
దేశీయ స్టాక్‌మార్కెట్లలో నేడు పుల్‌బ్యాక్ ర్యాలీకి ఆస్కారం కనిపిస్తోంది. ఆసియా మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలే అందుతున్నాయి. గిఫ్ట్ నిఫ్టీ 160PTS లాభంతో 23,289 వద్ద ట్రేడవుతుండటం సానుకూల పరిణామం. డాలర్ ఇండెక్స్ పెరుగుతున్నప్పటికీ బాండ్ యీల్డులు, క్రూడాయిల్ ధరలు కాస్త తగ్గాయి. జపాన్ నిక్కీ భారీగా పతనమైంది. తైవాన్ సూచీ పెరిగింది. STOCKS 2 WATCH: HCL, ANGEL ONE, ANAND RATHI, HSCL, DEN, ADANI ENERGY
News January 14, 2025
విద్యుత్ ఛార్జీల పెంపు లేనట్టే!
TG: వచ్చే ఆర్థిక సంవత్సరంలో విద్యుత్ ఛార్జీలను పెంచొద్దని ప్రభుత్వం నిర్ణయించింది. ఛార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరగా తిరస్కరించింది. ప్రస్తుత ఛార్జీలనే కొనసాగించాలని ఆదేశించింది. ఇదే విషయాన్ని పేర్కొంటూ ERCకి ప్రతిపాదనలు పంపాలని సూచించింది. ఈ మేరకు ఈనెల 18న డిస్కంలు తమ ప్రతిపాదనలను ERCకి సమర్పించే ఛాన్సుంది. డిస్కంల నష్టాల మొత్తాన్ని ప్రభుత్వం సబ్సిడీగా ఇస్తేనే ఛార్జీల పెంపు ఉండదని సమాచారం.
News January 14, 2025
ALERT.. నేడు ఈ జిల్లాల్లో వర్షాలు
AP: కన్యాకుమారి సమీపంలో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇవాళ, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని ఐఎండీ పేర్కొంది. చిత్తూరు, నెల్లూరు, అన్నమయ్య, తిరుపతిలో ఇవాళ వర్షం కురిసే అవకాశముందని తెలిపింది. నిన్న నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, తిరుపతితో సహా పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిశాయి. మరోవైపు ఉత్తర కోస్తాలో చలి తీవ్రత కొనసాగుతోంది.