News December 24, 2024
అశ్విన్ స్థానంలో అన్‌క్యాప్డ్ ప్లేయర్
ఆస్ట్రేలియాతో మిగతా రెండు టెస్టులకు అశ్విన్ స్థానంలో యువ క్రికెటర్, అన్‌క్యాప్డ్ ప్లేయర్ తనుష్ కోఠియన్‌ను BCCI అనూహ్యంగా ఎంపిక చేసింది. బాక్సింగ్ డే టెస్టుకు ముందు ఆయన జట్టులో చేరనున్నట్లు తెలిపింది. ఈ ముంబై ఆల్‌రౌండర్ 33 ఫస్ట్ క్లాస్ మ్యాచుల్లో 101 వికెట్లు తీశారు. బ్యాటింగ్‌లో 1,521 పరుగులు చేశారు. వీటిలో రెండు సెంచరీలు ఉన్నాయి.
Similar News
News December 24, 2024
ఏపీ వాళ్లు తెలంగాణలో ఉండాలంటే వీసా కావాలా?: విష్ణు
AP:అల్లు అర్జున్ ఆంధ్రోడని, బతకడానికి వచ్చాడని కాంగ్రెస్ MLA భూపతిరెడ్డి చేసిన <<14969335>>వ్యాఖ్యలపై <<>>BJP రాష్ట్ర ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి మండిపడ్డారు. ‘రేవంత్ రెడ్డి గారు AP వాళ్లు TGలో ఉండాలంటే ప్రత్యేక వీసా తీసుకోవాలా? TG ఏర్పడిన 11 ఏళ్ల తర్వాత కూడా ఈ రెచ్చగొట్టే మాటలు ఏంటి? ఇదేనా కాంగ్రెస్ సంస్కృతి? మీ MLAపై వెంటనే చర్యలు తీసుకోవాలి. లేదంటే మీ పార్టీని తెలంగాణ సమాజం క్షమించదు’ అని Xలో ఫైరయ్యారు.
News December 24, 2024
IND vs PAK: కింగ్ కోహ్లీకి స్పెషల్ మ్యాచ్
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా ఫిబ్రవరి 23న జరిగే భారత్, పాకిస్థాన్ మ్యాచ్ విరాట్ కోహ్లీకి ప్రత్యేకంగా మారనుంది. ఈ మ్యాచ్ ఆయనకు 300వ వన్డే కావడం విశేషం. విరాట్ ఇప్పటివరకు 295 వన్డేలకు ప్రాతినిధ్యం వహించారు. కోహ్లీ ప్రస్తుతం ఆస్ట్రేలియా పర్యటనలో ఉన్నారు. బాక్సింగ్ డే టెస్టు కోసం ఆయన సన్నద్ధమవుతున్నారు.
News December 24, 2024
కాంగ్రెస్ ఆరోపణల్ని కొట్టిపారేసిన EC
MH అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్ల జాబితా అవకతవకలపై కాంగ్రెస్ చేసిన ఆరోపణలను ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. జాబితాలో ఏకపక్షంగా ఓటర్ల తొలగింపు, కొత్త ఓటర్ల చేర్పులు జరగలేదని స్పష్టం చేసింది. పోలింగ్ ముగిసే 5 PM నాటి డేటాను పూర్తి ఓటింగ్ సరళితో పోల్చడం సరికాదంది. అభ్యర్థులు నియమించిన ఏజెంట్లకు పోలింగ్ ముగిశాక ఇచ్చిన Form-17Cలోని ఓటింగ్ వివరాల్ని మార్చడం అసాధ్యమని తెలిపింది.